TRS vs BJP: అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి విజన్ కొరతే.. మంత్రి KTR విమర్శనాస్త్రాలు

|

May 02, 2022 | 11:09 AM

Telangana Politics: కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్(Telangana Minister KTR). దేశంలో బొగ్గు కొరత కారణంగా నెలకొన్న విద్యుత్ సమస్యపై ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు.

TRS vs BJP: అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి విజన్ కొరతే.. మంత్రి KTR విమర్శనాస్త్రాలు
Telangana Minister KTR(File Photo)
Follow us on

Telangana Politics: కేంద్ర ప్రభుత్వాన్ని మరోసారి టార్గెట్ చేశారు తెలంగాణ మంత్రి కేటీఆర్(Telangana Minister KTR). దేశంలో బొగ్గు కొరత కారణంగా నెలకొన్న విద్యుత్ సమస్యపై ట్విట్టర్ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై విమర్శనాస్త్రాలు సంధించారు. దేశంలో నెలకొన్న అన్ని సమస్యలకు మూలం ప్రధాని మోడీకి సరైన విజన్ లేకపోవడమేనంటూ ఎద్దేవా చేశారు. బొగ్గు కొరత కారణంగా విద్యుత్ సమస్య ఏర్పడినట్లు పత్రికలో వచ్చిన కథనాన్ని జతచేర్చూతూ కేటీఆర్ కేంద్రంపై విరుచుకపడ్డారు. ‘బీజేపీ పాలనలో బొగ్గు కొరత, కరోనా టైంలో ఆక్సిజన్ కొరత, పరిశ్రమలకు కరెంట్ కొరత, యువతకు ఉద్యోగాల కొరత, గ్రామాల్లో ఉపాధి కొరత, రాష్ట్రాలకిచ్చే నిధుల కొరత.. అన్ని సమస్యలకు మూలం పీఎం మోడీకి విజన్ కొరత’ అంటూ ఎద్దేవా చేశారు.

మంత్రి కేటీఆర్ ట్వీట్..

మరిన్ని రాజకీయ వార్తలు ఇక్కడ చదవండి..

Also Read..

May New Rules: అలర్ట్.. ఈ నెలలో మారిన కొత్త రూల్స్ ఇవే.. బ్యాంకుల నుంచి సిలిండర్స్ వరకు..

Edible Oil: వంట నూనెల ధరలపై గుడ్ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. విషయం ఏంటంటే?