Minister KTR: ఒకే దేశంలో.. ఒకే వ్యాక్సిన్‌.. రెండు ధరల్లో వ్యత్యాసం ఎందుకు.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్

|

Apr 22, 2021 | 1:05 PM

దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ వేదికగా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు.

Minister KTR: ఒకే దేశంలో.. ఒకే వ్యాక్సిన్‌.. రెండు ధరల్లో వ్యత్యాసం ఎందుకు.. కేంద్రం తీరుపై మంత్రి కేటీఆర్ ట్వీట్
KTR
Follow us on

Minister KTR: దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్ల ధరల వ్యత్యాసంపై తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్‌ ఘాటుగా స్పందించారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ వేదికగా కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించారు. ‘‘ఒకే దేశంలో ఇప్పుడు వ్యాక్సిన్లకు 2 ధరలు చూస్తున్నాం. కేంద్రానికి రూ.150, రాష్ట్రాలకు రూ.400 టీకా అంటున్నారు. అదనపు ఖర్చుని కేంద్రం పీఎం కేర్స్‌ నిధి నుంచి భరించలేరా? దేశమంతా వ్యాక్సినేషన్‌ పూర్తికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందా?ఒకే దేశం ఒకే పన్ను కోసం జీఎస్టీని అంగీకరించాం’’ అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదిలావుంటే, దేశంలోని పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కరోనా వ్యాక్సిన్‌లు, ఆక్సిజన్, రెమిడిసివిర్ మందు కొరత ఉంది. కేంద్రం తీరుపై ఆయా రాష్ట్రాలు మండిపడుతున్నాయి. సరిపడా వ్యాక్సిన్‌లు, ఆక్సిజన్ సిలిండర్లను ఎందుకు సరఫరా చేయడం లేదని దుమ్మెత్తిపోస్తున్నాయి. ఇదే క్రమంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ కూడా కేంద్రాన్ని టార్గెట్ చేశారు. కోవిషీల్డ్ ధరలపై ఆయన మండిపడుతున్నారు.

”జీఎస్టీ పేరిట వన్ నేషన్ వన్ ట్యాక్స్ అంటే మేం అంగీకరించాం. కానీ ఇప్పుడు ఒకే దేశంలో రెండు వేర్వేరే టీకా ధరలను చూస్తున్నాం. భారత ప్రభుత్వానికి రూ.150 ఇస్తున్న టీకాను రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం రూ.400కు ఇస్తున్నారు. అదనపు ఖర్చును పీఎం కేర్స్ నిధుల నుంచి కేంద్రం భరించి, వ్యాక్సినేషన్ పక్రియను వేగవంతం చేయలేదా?” అని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సబ్‌కా సాథ్.. సబ్‌కా వాక్సిన్ హ్యాష్‌ట్యాగ్‌తో మంత్రి కేటీఆర్ ఈ ట్వీట్ చేశారు.

Read Also…  Corona Vaccination: క‌రోనా నుంచి కోలుకున్నారా..? అయితే వ్యాక్సిన్‌కు తొంద‌ర ఏమీ లేదంటోన్న వైద్యులు..