Telangana: తెలంగాణ పర్యటనలో ఉన్న అమిత్ షా పై రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు వేశారు. ట్విట్టర్ వేధికగా.. బీజేపీ తీరును తూర్పారబట్టారు. ‘‘అమిత్ షా సర్.. సంస్కారీ రేపిస్టుల విడుదల విషయంలో మీ వైఖరేంటో చెప్పండి. తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు.’’ అంటూ కేటీఆర్ ట్విట్టర్‌లో పోస్ట్ పెట్టారు. రేపిస్టుల విషయంలో కఠినంగా ఉంటామంటూ ఎర్రకోట నుంచి ప్రధాని మోదీ ఇచ్చిన సందేశాన్ని గుజరాత్ ప్రభుత్వం లైట్ తీసుకుందా? అంటూ సెటైర్లు వేశారు మంత్రి కేటీఆర్.
అలాగే ఫాదర్ ఆఫ్ ఏస్ క్రికెటర్ తెలంగాణకు వస్తున్నారంటూ అమిత్‌షాపై మరో ట్వీట్ చేశారు కేటీఆర్. జై షాపై సెటైర్లు వేస్తూ మరో ట్వీట్ చేశారు. అన్న ఎంపీగా, భార్య ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఉన్న ఓ నాయకుడికి ఇవాళ అమిత్‌షా మద్దతు తెలిపేందుకు వస్తున్నారన్నారు. అలాంటి, అమిత్‌షా వారసత్వ రాజకీయాలపై లెక్చర్లు ఇస్తారంటూ వ్యంగాస్త్రాలు సంధించారు.
Dear HM @AmitShah Ji,
People of Telangana are very keen to hear from you on why your Govt decided to release “Sankari Rapists” of #BilkisBano
Balathkar Justification is against what Hon’ble PM preached from the ramparts of Red Fort
Is Gujarat Govt not taking PM sir seriously?
— KTR (@KTRTRS) August 21, 2022
మరిన్ని తెలంగాణ వార్తలపై ఈ లింక్ క్లిక్ చేయండి..