Hyderabad: విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌.. ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేసిన కేటీఆర్‌

హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా మారుతోంది. మన హైదరాబాద్ తెలుగు ప్రజల గుండెకాయగా మారిపోయింది. ఈ నగరం ఎంతో ఆదుకుంటోంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రాంతంగా మారుతోంది..

Hyderabad: విశ్వనగరంగా మారుతున్న హైదరాబాద్‌.. ట్విట్టర్‌లో వీడియో పోస్టు చేసిన కేటీఆర్‌
Hyderabad

Updated on: Jan 23, 2023 | 3:56 PM

హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా మారుతోంది. మన హైదరాబాద్ తెలుగు ప్రజల గుండెకాయగా మారిపోయింది. ఈ నగరం ఎంతో ఆదుకుంటోంది. లక్షలాది మందికి ఉపాధి కల్పించే ప్రాంతంగా మారుతోంది. పెట్టుబడులకు వేదికగా మారుతోంది. కొత్త కొత్త కంపెనీలు వస్తుండటంతో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. ఇతర నగరాలు, పల్లె ప్రాంతాల నుంచి సైతం ఎంతో మంది హైదరాబాద్‌కు వచ్చి ఉపాధి పొందుతున్నారు. తాజాగా హైదరాబాద్ సంబంధించి సందర్శినీయ ప్రదేశాలు, నగర అభివృద్ధికి సంబంధించిన వీడియో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

ఈ వీడియోలో హైదరాబాద్‌ నగర సుందర ప్రదేశాలు, డెవలప్‌మెంట్‌కు సంబంధించిన దృశ్యాలు ఈ వీడియోలో ఉన్నాయి. ఈ వీడియోలో ట్యాంక్‌బండ్‌, చార్‌మినార్‌, కుతుబ్‌షాహి పార్క్‌, గండిపేట పార్క్, బన్సీలాల్ పేట మెట్ల బావి, టీ హబ్, పోలీస్ కమెండ్ కంట్రోల్ సెంటర్, షైక్ పేట ఫ్లైఓవర్, ముక్తి ఘాట్, ట్యాంక్ బండ్, కొత్తగా నిర్మిస్తున్న సెక్రేటెరియట్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఔటర్ రింగ్ రోడ్డు, మెట్రో రైల్వే స్టేషన్, మెజాంజాహి మార్కెట్, మైండ్ స్పేస్ జంక్షన్ తదితర పార్కులు ఈ వీడియోలో చూడవచ్చు.

ఇవి కూడా చదవండి

 


ఇంత అభివృద్ధి చెందుతున్న ఈ మహానగరంలో కొత్త కొత్త సంస్థలు వస్తున్నాయి. పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తున్నారు. మైక్రోసాఫ్ట్‌ తెలంగాణలో మరో రూ.16,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. అలాగే వాటర్‌ హీటర్ల తయారీకి సంబంధించిన ఫ్యాక్టరీ ఏర్పాటు కానుంది. తెలంగాణలో వచ్చే ఏడేళ్లలో 36,300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అమెజాన్ సైతం ముందుకు వచ్చింది.

మరిన్ని  తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి