Minister KTR Inauguration of Pokarna Stones: పారిశ్రామిక రంగంలో దేశంలోనే తెలంగాణ ముందు వరుసలో ఉందని రాష్ట్ర మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు తెలిపారు. కొత్త పరిశ్రమల ఏర్పాటుతో పాటు ఉత్పత్తి రంగంలో రాష్ట్రం వేగంగా దూసుకెళ్తోందన్నారు. 2015 సంవత్సరం టీఎస్ ఐపాస్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణకు రూ.2.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పరిశ్రమలతో రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయన్నారు.
రంగారెడ్డి జిల్లా కొత్తూరు సమీపంలోని మేకగూడలో ఏర్పాటు చేసిన పోకర్ణ ఇంజనీర్డ్ స్టోన్ లిమిటెడ్ కంపెనీని మంత్రులు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలో సమర్థవంతమైన నాయకత్వం, సుస్థిరతతో కూడిన ప్రభుత్వం ఉన్నందునే పెట్టుబడులు తరలివస్తున్నాయి. ఈ రెండు సమతుల్యంగా ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ నాయకత్వంలో అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి జరుగుతుందని పేర్కొన్నారు. ఐటీ, పారిశ్రామిక రంగాలకు ప్రాధాన్యం ఇస్తూనే, ఉపాధి కల్పనలకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు.
విదేశీ సంస్థలను ఆకర్షించడంతో పాటు కొత్త పరిశ్రమల ఏర్పాటు సరళీకృతం చేస్తూ.. టీఎస్ ఐపాస్ లాంటి విప్లవాత్మక సంస్కరణలు ఎన్నో చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ ఐపాస్ లాంటి పాలసీ ఏ రాష్ట్రంలో లేదన్నారు. 15 రోజుల్లోనే పరిశ్రమలకు అనుమతులు ఇస్తున్నామన్న కేటీఆర్.. 15 రోజుల్లో అనుమతి రాకపోతే డీమ్డ్ అప్రూవ్డ్‌గా భావించవచ్చు అని పేర్కొన్నారు. పరిశ్రమలకు నిరాంతరాయంగా నాణ్యమైన కరెంటు, నీళ్లు అందిస్తున్నామని స్పష్టం చేశారు. పోకర్ణ కంపెనీ ద్వారా స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని మంత్రి సంస్థ యాజమాన్యాన్ని కోరారు. ఈ ప్లాంటు ద్వారా ప్రత్యక్షంగా 500 మందికి, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. ఈ కంపెనీకి అన్ని విధాలా తెలంగాణ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. కలిసికట్టుగా ముందుకు నడిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని కేటీఆర్ పేర్కొన్నారు.
Ministers @KTRTRS, @SabithaindraTRS and @DayakarRao2019 formally inaugurated the state of the art Pokarna Engineered Stone Ltd – Quantra Quartz manufacturing facility in Mekaguda village of Ranga Reddy Dist. pic.twitter.com/y1Nnj9WLAF
— Minister for IT, Industries, MA & UD, Telangana (@MinisterKTR) July 31, 2021
Read Also…