Harish Rao: తెలంగాణలో మెరుగైన వైద్యం అందేలా వసతుల కల్పన.. వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ వరుస సమీక్షలు

|

Dec 12, 2021 | 4:12 PM

ఎక్కడి నుండి వచ్చే వారికి అయిన తెలంగాణ లో మంచి వైద్యం అందేలా వసతుల కల్పన చేస్తున్నారు తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు.

Harish Rao: తెలంగాణలో మెరుగైన వైద్యం అందేలా వసతుల కల్పన.. వైద్యారోగ్య శాఖపై మంత్రి హరీష్ వరుస సమీక్షలు
Harish Rao Review
Follow us on

Minister Harish Rao Medical Review: ప్రతిఒక్క పేదవాడికి మెరుగైన ప్రజా వైద్యం అందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. ఆదివారం వైద్య ఆరోగ్య శాఖపై మంత్రి హరీష్ రావు వరుస సమీక్షలు నిర్వహించారు. కరోనా నివారణతో పాటు కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కట్టడిలో భాగంగా ఎప్పటికప్పుడు కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో అందుబాటులో ఉన్న సదుపాయాలపై స్వయంగా పర్యటిస్తూ పరిశీలిస్తున్నారు. మొన్న టీమ్స్, ఆ తరవాత నిమ్స్, నిన్న గాంధీ రేపు ఉస్మానియా అంటూ వరుసగా పెద్ద ఆసుపత్రుల పర్యటన చేస్తూ అక్కడి పరిస్థితులను మంత్రి ఆరా తీస్తున్నారు.

ట్రబుల్ షూటర్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రతి రోజు ఆసుపత్రుల పర్యటన చేస్తూ మెరుగైన ప్రజారోగ్యం కోసం వైద్య సదుపాయాలు ఎలా ఉన్నాయి?ఏం కావాలి?ఎలా చేయాలి?అనే అంశాలను ఎప్పుటికప్పుడు నిర్ణయం తీసుకుంటుముందుకు వెళ్తున్నారు. మొన్న నిమ్స్ ఆసుపత్రి సందర్శించిన ఆరోగ్య మంత్రి హరీశ్ రావు.ఎండోస్కోపీక్ ఎక్విప్మెంట్, ఎం అర్ యు ల్యాబ్, స్టెమ్ సెల్ రీసెర్చ్ ఫెసిలిటీ, ఫిజియోథెరపీ విభాగం, బోన్ డెన్సిటోమీటర్, శాంపిల్ ట్రాన్స్ పోర్ట్ సిస్టం వాటర్ ఏటిఎం,జన్యుపరమైన వ్యాధులకు సంబంధించి రిసర్చ్, గుర్తింపునకు కొత్తగా ల్యాబ్‌‌ను మంత్రి ప్రారంభించారు. అన్ని విభాగాల హెచ్ఓడి లతో సమీక్ష నిర్వహించారు. మెరుగైన వైద్యం ప్రభుత్వ రంగంలో అందించాలంటే కొంత ఎక్విప్మెంట్ కావాలని కోరడంతో నిధుల మంజూరుకు నిర్ణయం తీసుకున్నారు. బెడ్స్ పెంచడంతో పాటు వెంటిలేటర్స్‌ను తొందరలో అందుబాటులోకి తీసుకోస్తామని మంత్రి హరీష్ రావు భరోసా ఇస్తున్నారు.

నిన్న గాంధీ ఆస్పత్రి లో సందర్శించిన మంత్రి సిటీ స్కాన్ ను ప్రారంభించి అక్కడ పరిస్థితులు, వైద్యులు, పేషేంట్ ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. త్వరలోనే గాంధీలో క్యాత్ లాబ్‌ను, ఎంఆర్ఐ స్కానింగ్‌ను అందుబాటులోకి తెస్తామని హామీ ఇచ్చారు. దీనితో పాటు గర్భిణీలకు ప్రత్యేకంగా 200 పడకల వార్డ్‌ను తీసుకువస్తామని అన్నారు మంత్రి. ఇలా విభాగాల వారిగా పెద్ద ఆస్పత్రులన్నిటిలో సమస్యలు తొలగించి మెరుగైనా వైద్యం ప్రతి ఒక్కరికి అందేలా ఆలోచనలు చేస్తూ నిర్ణయం తీసుకుంటున్నారు మంత్రి. త్వరలో ఉస్మానియా ఆసుపత్రి ని సందర్శించి అక్కడి పరిస్థితి ల పై సమీక్షిస్తామని అంటున్నారు. త్వరలో ఉస్మానియా ఆసుపత్రి లో క్యాత్ లాబ్ ను ప్రారంభిస్తామని దీనితో ఎక్కడి నుండి వచ్చే వారికి అయిన తెలంగాణ లో మంచి వైద్యం అందేలా వసతుల కల్పన చేస్తున్నారు.

Read Also… UP Assembly Elections: యూపీ ఎన్నికలకు ముందే బీజేపీకి భారీ షాక్.. సమాజ్‌వాదీ గూటికి మాజీ మంత్రి హరిశంకర్