Minister Errabelli: మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు క‌రోనా పాజిటివ్.. హోం ఐసోలేష‌న్‌లో చికిత్స!

|

Dec 25, 2021 | 9:37 PM

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Minister Errabelli: మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుకు క‌రోనా పాజిటివ్.. హోం ఐసోలేష‌న్‌లో చికిత్స!
Minister Errabelli Dayakar Rao
Follow us on

Minister Errabelli Dayakar Rao: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇటీవల వారం రోజులు రైతుల కోసం డిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్న ఆయన కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారు. దీంతో ఆయన కరోనా సోకినట్లు తేల్చింది. దీంతో ఆయన హోం క్వారంటైన్ లోకి వెళ్లిపోయారు. అయితే, తనతో సన్నిహితంగా తిరిగిన వారు.. గతకొన్ని రోజులుగా ఆయన కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. అయితే, ప్రస్తుతం ఆయ‌న ఆరోగ్యం నిల‌క‌డ గానే ఉంద‌ని వైద్యులు తెలిపారు.

మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావుతో సహా పలువురు మంత్రుల బృందం ఇటీవ‌ల ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం నుంచి వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని కేంద్ర మంత్రుల‌తో చ‌ర్చించారు. దాదాపు వారం రోజుల పాటు మంత్రి ఎర్ర‌బెల్లి ఢిల్లీ లోనే గడిపారు. నిన్న రాత్రి మంత్రి ఎర్రబెల్లి తిరిగి హైద‌రాబాద్ చేరుకున్నారు. అయితే ఈ రోజు ఆయ‌న స్వల్ప ఆస్వ‌స్థ‌త కు గురి కావ‌డంతో క‌రోనా నిర్ధార‌ణ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. దీంతో ఆయ‌నకు పాజిటివ్ వ‌చ్చింది.

కాగా, తన ఐసోలేషన్ పూర్తయ్యే వరకు ప్రజలు ఎవరూ తనను కలవడానికి తన వద్దకు రావద్దని మంత్రి ఎర్రబెల్లి విజ్ఞప్తి చేశారు. తను ప్రాతినిధ్యం వహిస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు ఇటు హైదరాబాద్ లో, అటు హన్మకొండ, పాలకుర్తి, ఇతర మండల కేంద్రాల్లో అధికారులు, పీ ఏ లు అందుబాటులో ఉంటారని, ప్రజల సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తారని, ప్రజలు సహకరించాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విజ్ఞప్తి చేశారు.

Read Also…. CJI NV Ramana: కార్యనిర్వాహక వ్యవస్థ పరిధికి మించి ప్రవర్తిస్తే కోర్టుల జోక్యం అవసరం.. కీలక వ్యాఖ్యలు చేసిన సీజేఐ