Telangana: తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల కోసం ఆలోచించింది ఇద్దరే ఇద్దరు నాయకులని ఒకరు దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ కాగా.. మరొకరు కేసీఆర్ అని పేర్కొన్నారు. కరీంనగర్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈవ్యాఖ్యలు చేశారు. పేద ప్రజల సంకేమం కోసం ఆలోచించే ఆ ఇద్దరు నాయకులంటే తనకు ఇష్టమని చెప్పారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యకులు బండి సంజయ్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సామాజిక పెన్షన్ ఎంత ఇస్తున్నారో బండి సంజయ్ తెలుసుకోవాలన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రైతులకు ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని, పైగా మోటార్లకు మీటర్లు పెడుతున్నారన్నారు. ఒక్కొక్క మోటార్ కు లక్ష రూపాయలు విద్యుత్తు బిల్లు వస్తుంది మీటర్లు పెడదామా అంటూ ప్రశ్నలు సంధించారు. బీజేపీ నాయకులు దుర్మార్గులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు మంత్రి ఎరబ్రెల్లి దయాకర్ రావు. తెలంగాణలో చేస్తున్న పాదయాత్ర దమ్ముంటే కర్ణాటక, ఉత్తరప్రదేశ్ లో చేద్దాం రావాలంటూ సవాలు విసిరారు. ప్రజలందరి సంక్షేమాన్ని కాంక్షించే పాలన తెలంగాణలో అందిస్తుంటే ఇక పాదయాత్రలు ఎందుకు చేస్తున్నట్లె అర్థంకావడం లేదన్నారు. బీజేపీ మతతత్వ పార్టీ అని, ఆపార్టీ వల్లే దేశం నాశనం అవుతోందంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రానికి రావల్సిన నిధులను కేంద్రప్రభుత్వం ఇవ్వడంలేదని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు విమర్శించారు.