Weather Report: పిడుగులు, అకాల వర్షంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం.. తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు

|

Jun 04, 2023 | 9:13 PM

పిడుగుపాటు వర్షం తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టాన్ని మిగిల్చింది. వికారాబాద్ జిల్లాలో తీవ్ర విషాదం నింపింది. తెలంగాణ ప్రజలు మరో మూడు రోజుల పాటు అలర్ట్ గా ఉండాలంటూ హైదరాబాద్ వాతావరణశాఖ హెచ్చరించింది.

Weather Report: పిడుగులు, అకాల వర్షంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ నష్టం.. తెలంగాణలో వచ్చే మూడు రోజులు వానలు
Thunderstorm
Follow us on

తెలుగు రాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పిడుగుపాటుతో పలుచోట్ల విషాదం నెలకొంది. వికారాబాద్ జిల్లా పరిగి పరిసర ప్రాంతాల్లో కురిసిన పిడుగులతో కూడిన వర్షం తీవ్ర విషాదాన్ని నింపింది. దోమ మండలం కొండాయిపల్లిలో పిడుగుపాటుకు వార్ల నర్సింలు అనే రైతు కు చెందిన ఒక ఆవు, లేగదూడ మృతి చెందాయి. రంగంపల్లి గ్రామంలో పిడుగుపడి యాదయ్య అనే రైతుకు చెందిన రెండు ఎడ్లు మృతి చెందాయి. పలు చోట్ల పిడుగులు పడి చెట్లు కాలిపోయాయి. వికారాబాద్ జిల్లా కుల్కచర్ల కురిసిన ఉరుములు మెరుపులతో కురిసిన వర్షం రైతులకు తీవ్ర విషాదాన్ని నింపింది. సాల్వీడ్ గ్రామంలో వేర్వేరు రైతులకు చెందిన 30కి గొర్రెలు మృతి చెందాయి. హైదరాబాద్ పరిసర ప్రాంతాలతో పాటు తెలంగాణ జిల్లాలోని ఉమ్మడి మెదక్‌ జిల్లా, సంగారెడ్డి, కంది, నారాయణఖేడ్‌, రేగోడ్‌, శివ్వంపేట, సిద్దిపేట, వరంగల్‌, జగదేవ్‌పూర్‌, ములుగులో వర్షం కురిసింది.

అటు ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుజిల్లా నూజివీడు, అనకాపల్లి, అల్లూరి జిల్లా జిమాడుగులలో వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. యలమంచిలి పరిసర గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసంది. పెద్ద గొల్లలపాలెంలో పిడుగు పడి కొబ్బరిచెట్టు కాలిపోయింది.

తెలంగాణలో రాగల మూడు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. తెలంగాణకు యెల్లో అలర్ట్‌ జారీ చేశారు. హైదరాబాద్ తోపాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు,ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని వాతావరణకేంద్రం హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం