KTR: హత్యకు గురైన బీఆర్ఎస్ కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన కేటీఆర్
తెలంగాణలో ఎన్నడూ హింసాయుత వాతావరణం లేదన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్‌కర్నూల్ జిల్లా గంట్రావుపల్లిలో ఇటీవల హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరపున మల్లేష్ కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. ప్రతీ కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడుల సంస్కృతి మంచిది కాదని సూచించారు..
తెలంగాణలో ఎన్నడూ హింసాయుత వాతావరణం లేదన్నారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్‌కర్నూల్ జిల్లా గంట్రావుపల్లిలో ఇటీవల హత్యకు గురైన మల్లేష్ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. పార్టీ తరపున మల్లేష్ కుటుంబానికి ఆర్థికసాయం అందజేశారు. ప్రతీ కార్యకర్తకూ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. దాడుల సంస్కృతి మంచిది కాదని సూచించారు కేటీఆర్. తమ ప్రభుత్వంలో ఫ్యాక్షన్ సంస్కృతి పెంచాలనుకోలేదు కాబట్టే పదేళ్లలో అంతా ప్రశాంతంగా ఉందన్నారు. ఈ హత్యరాజకీయలను అందరూ ఖండించాలని విజ్ఞప్తి చేశారు కేటీఆర్. మల్లేష్ మర్డర్ పై పోలీసులు ప్రజలకు వాస్తవవాలు తెలియజేయాలన్నారు.
అంతకు ముందు మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి కుటుంబాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఆల వెంకటేశ్వర రెడ్డి సోదరుడు ఆల శశివర్ధన్ రెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోయారు.