
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే పార్లమెంట్ ఎలక్షన్స్‌ను కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మెజార్టీ లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా ముందుకెళ్తోంది. దానిలో భాగంగా.. సికింద్రాబాద్ పార్లమెంట్ పరిధిలో తెలంగాణ బీజేపీ చీఫ్, ఎంపీ అభ్యర్థి కిషన్‌రెడ్డి ఎలక్షన్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. డీడీ కాలనీ, బాగ్‌అంబర్‌పేట్‌లోని మల్లికార్జుననగర్, శివం రోడ్, అమీర్‌పేటలో పరిధిలోని కీర్తి అపార్ట్‌మెంట్, సారథి స్టూడియో, మధురానగర్ ప్రాంతాల్లో ప్రచారం చేశారు. ముందుగా.. డీడీ కాలనీలోని అహోబిలం మఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు కిషన్‌రెడ్డి. అంబర్‌పేట్‌లో డీడీ కాలనీ వాసులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఆ తర్వాత.. మల్లికార్జుననగర్‌లో బస్తీ వాసులతో సమావేశం అయ్యారు. మల్లికార్జుననగర్ శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఇక.. పార్లమెంట్ ఎన్నికల్లో తనను మరోసారి ఆశీర్వదించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ముఖ్యమైన మిత్రులు, బస్తీ పెద్దలు, కుల సంఘాల నేతలను కలిసే ప్రయత్నం చేస్తున్నానన్నారు కిషన్‌రెడ్డి. ఏ బస్తీకి వెళ్లినా.. ఏ వాడకు వెళ్లినా అద్భుత స్పందన వస్తుందని చెప్పారు. మోదీ పాలన పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ.. ఆయన మూడోసారి కూడా ప్రధాని కావాలని అన్ని వర్గాల ప్రజలు కోరుకుంటున్నారు. సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్‌లోనూ ప్రజల సహకారంతో మంచి మెజార్టీతో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దేశంలోని పరిస్థితుల దృష్ట్యా ఎవరిని కలిసినా మోదీ ప్రభుత్వం మళ్లీ రావాలని కోరుకుంటున్నారన్నారు. మోదీ చేతుల్లోనే దేశం భద్రంగా ఉంటుందని.. మోదీ నాయకత్వంలోనే దేశం అభివృద్ధి చెందుతుందని.. మోదీ పాలనలోనే పేదల ప్రజలకు మేలు జరుగుతుందని ప్రజలందరూ భావిస్తున్నారని చెప్పారు.. ఇక.. ఈ ఎన్నికల్లో దేశంలో NDAకి 400 సీట్లు, తెలంగాణలో మెజార్టీ స్థానాలు సాధించడం ఖాయమన్నారు కిషన్‌రెడ్డి.
Addressed members of the Kshatriya Samaj today in #Secunderabad
Interacted with them and noted their suggestions & opinions to build a strong & prosperous #Secunderabad. pic.twitter.com/LMX2UjoZZi
— G Kishan Reddy (Modi Ka Parivar) (@kishanreddybjp) April 7, 2024
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…