Jagtial: తాను నాటిన చెట్టుని కొట్టేశారంటూ ఓ వ్యక్తి నిరసన.. చెట్టును కొట్టిన వ్యక్తికి ఐదు వేలు ఫైన్ వేసిన అధికారులు

|

Aug 30, 2021 | 12:02 PM

Jagtial: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ చేయాలని ప్రభుత్వాలు, అధికారులు కోరుతున్నారు. మానవాళి మనుగడకే ముప్పు అంటూ మొక్కలను నాటే..

Jagtial: తాను నాటిన చెట్టుని కొట్టేశారంటూ ఓ వ్యక్తి నిరసన.. చెట్టును కొట్టిన వ్యక్తికి ఐదు వేలు ఫైన్ వేసిన అధికారులు
Jagityala Man
Follow us on

Jagtial: పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు.. ప్రతిఒక్కరు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణ చేయాలని ప్రభుత్వాలు, అధికారులు కోరుతున్నారు. మానవాళి మనుగడకే ముప్పు అంటూ మొక్కలను నాటే కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా తెలంగాణాలో హరితహారం పేరుతో చేపట్టిన మొక్కల పెంపకం కార్యక్రమ దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. హరితహార కార్యక్రమంలో భాగంగా సెలబ్రెటీలు, రాజకీయనేతలు నుంచి సామాన్యులు కూడా మొక్కలను నాటుతున్నారు. అయితే అటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఓ వ్యక్తి నాటిన చెట్లను కొట్టేశారంటూ నిరసనకు దిగాడు. దీంతో అధికారులు రంగంలోకి దిగి.. చర్యలు చేపట్టారు. వివరాల్లోకి వెళ్తే..

జగిత్యాలలో తాను నాటిన చెట్టును కొట్టేశారని చర్యలు తీసుకోవాలని కోరుతూ ఓ వ్యక్తి నిరసనకు దిగాడు. జగిత్యాల ఎల్ జీ రాం లాడ్జీ వెనుక ఉండే ప్రభాకర్ అనే వ్యక్తి నివాసం ఉంటాడు. సమీపంలోని రోడ్డు పై కూర్చొని ప్రభాకర్ నిరసనకు దిగాడు. తనకు రావాల్సిన ఆస్తిని తమ సోదరులు ఇవ్వడం లేదని ఆరోపించాడు. అంతేకాదు తాను నాటిన చెట్టును కొట్టేశారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఓ వైపు చెట్లు నాటాలాని ప్రభుత్వం చెప్పు తుంటే మరోవైపు చెట్లను కొట్టేస్తున్నారని అన్నారు. చెట్టుని కొట్టేసిన వారి పై చర్యలు తీసుకోవాలని ప్రభాకర్ అధికారులను కోరాడు. ప్రభాకర్ నిరశనపై వెంటనే మున్సిపల్ అధికారులు స్పందించారు. చెట్టు ను కొట్టిన వ్యక్తికి ఐదు వేల రూపాయల జరిమానా విధించారు.

 

Also Read:  రోడ్లు అధ్వానంగా ఉన్నాయి.. రిపేర్ చేయించండని సీఎం జగన్‌కు సర్పంచ్ లేఖ.. పరుగులు పెట్టిన అధికారులు