Telangana: కూలర్‌లో నీళ్లు పోస్తుండగా అనంతలోకాలకు.. అసలేం జరిగిందంటే.!

|

Apr 22, 2023 | 8:21 PM

మీరు కూడా కూలర్‌లలో నీళ్లు నింపుతుంటే.. జర జాగ్రత్త.. దాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయడమే కాదు.. నీటిని నింపేటప్పుడు..

Telangana: కూలర్‌లో నీళ్లు పోస్తుండగా అనంతలోకాలకు.. అసలేం జరిగిందంటే.!
Cooler
Follow us on

తెలంగాణలోని ములుగు జిల్లా వాజేడు మండలం శ్రీరామ్ నగర్‌లో శనివారం విషాదం నెలకొంది. ఇంట్లోని కూలర్‌లో నీళ్లు నింపుతుండగా విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడు ఐటీబీపీ జవాన్ మనోజ్ కుమార్‌గా గుర్తించారు. ప్రస్తుతం అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఐటీబీపీ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తోన్న మనోజ్.. ఇటీవల సెలవులపై ఇంటికి వచ్చాడు.

ఈలోగా విద్యుదాఘాతంతో ప్రాణాలు కోల్పోవడంతో స్థానికంగా విషాద ఛాయలు నెలకొన్నాయి. కుటుంబ సభ్యుల సమాచారం మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా, వేసవి తాపం నుంచి తమను తాము రక్షించుకునేందుకు ప్రజలు ఏసీలు, కూలర్‌‌లను వినియోగిస్తున్నారు. మీరు కూడా కూలర్‌లలో నీళ్లు నింపుతుంటే.. జర జాగ్రత్త.. దాన్ని ఎప్పటికప్పుడు సర్వీసింగ్ చేయడమే కాదు.. నీటిని నింపేటప్పుడు పవర్ ఆఫ్ అయ్యిందో లేదో చూసుకోండి.