KTR Vaccinated: కోవిడ్ వాక్సిన్ ఫస్ట్‌ డోస్ తీసుకున్న మంత్రి కేటీఆర్.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు

|

Jul 20, 2021 | 7:11 PM

KTR Vaccinated: ఓ వైపు రూపాలు మార్చుకుంటూ కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్తియ కొనసాగుతుంది. ఈ నేప‌థ్యంలో..

KTR Vaccinated: కోవిడ్ వాక్సిన్ ఫస్ట్‌ డోస్ తీసుకున్న మంత్రి కేటీఆర్.. ఫ్రంట్‌లైన్ వారియర్స్‌కు సోషల్ మీడియా వేదికగా కృతఙ్ఞతలు
Ktr Corona Vaccine
Follow us on

KTR Vaccinated: ఓ వైపు రూపాలు మార్చుకుంటూ కరోనా వైరస్ విజృంభిస్తుంటే.. మరోవైపు ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ కట్టడి కోసం వ్యాక్సినేషన్ ప్రక్తియ కొనసాగుతుంది. ఈ నేప‌థ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తనయుడు , ఐటీ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ కరోనా వ్యాక్సిన్ ను వేయించుకున్నారు. తాను కరోనా టీకా తీసుకున్నట్లు సోషల్ మీడియా వేదికగా తెలిపారు.
ఈరోజు మొదటి డోస్ తీసుకున్నానని .. డాక్టర్ శ్రీ కృష్ణ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ ఇచ్చిన కెరినా జ్యోతికి మంత్రి కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.

మంత్రి కేటీఆర్ 2021 ఫిబ్రవరి 23 న కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే.. తనకు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని ఆయన అప్పుడు కూడా స్వయంగా ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. తాను స్వల్ప కరోనా లక్షణాలతో బాధిపడిన ఆయన హోం ఐసోలేషన్ లో ఉండి చికిత్స పొందిన సంగతి తెలిసిందే.. అయితే ఇప్పడు ప్రపంచంలో చాలా దేశాలు కరోనా థర్డ్ వేవ్ లో అడుగు పెట్టగా.. భారత దేశంలో సెకండ్ వేవ్ ఇంకా కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర, కేరళ వంటి రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గినట్లు తగ్గి.. మళ్ళీ భారీగా పాజిటివ్ కేసులు పెరుగున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ముందస్తు చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బంది హెచ్చరికలు జారే చేస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ కార్యక్రమం మరింత వేగంగా జరిపించాలని తెలిపారు.. దీంతో మంత్రి కేటీఆరే .. తాను వ్యాక్సిన్ వేయించుకున్నా.. ప్రతి ఒక్కరూ కరోనా టీకా తీసుకోవాలని పిలుపునిచ్చారు.

 

 

Also Read: ఆర్ఆర్ఆర్ మూవీ ఫోటో వైరల్.. భీమ్‌ని విడిపించిన రామరాజు.. ఈ సన్నివేశం ఎప్పుడు అంటూ ఫ్యాన్స్‌లో ఆసక్తి