ఇవాళ్టి నుంచి తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ నెల 14 వరకూ ప్రధాన పరీక్షలు, 15 నుంచి 18 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, 19న నైతిక, మానవ విలువలు, 20న పర్యావరణ విద్య పరీక్షలు జరగనున్నాయి. ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకూ.. ద్వితీయ సంవత్సర పరీక్షలు మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 గంటల వరకు జరుగుతాయి.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 857 పరీక్షాకేంద్రాలను సిద్ధం చేసినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా లోనికి అనుమతించబోమని ఆయన స్పష్టం చేశారు. మాల్‌ప్రాక్టీస్ చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.