Telangana: తెలంగాణ విద్యార్థులకు షాక్.. సంక్రాంతి సెలవులు కుదింపు.. కేవలం వారికి మాత్రమే

తెలంగాణలో ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్ కాలేజీలు, గురుకులాలకు ఈనెల 14 నుంచి 16వ తేదీ వరకు మూడు రోజులే సంక్రాంతి సెలవులు ఉంటాయని ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌ మిట్టల్ తెలిపారు.

Telangana: తెలంగాణ విద్యార్థులకు షాక్.. సంక్రాంతి సెలవులు కుదింపు.. కేవలం వారికి మాత్రమే
Telangana Inter Students

Updated on: Jan 08, 2023 | 4:26 PM

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ ఇంటర్మీడియెట్‌‌ కాలేజీలకు, గురుకులాలకు ఈ నెల 14 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఇస్తున్నామని ఇంటర్‌‌ బోర్డు సెక్రటరీ నవీన్‌‌ మిట్టల్‌‌ ఒక ప్రకటనలో తెలిపారు. జనవరి 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగ సందర్భంగా ఆ 3 రోజులే సెలవులు ఇచ్చారు. గవర్నమెంట్‌‌, ప్రైవేట్‌‌, ఎయిడెడ్‌‌, కో ఆపరేటివ్‌‌, రెసిడెన్షియల్‌‌, కేజీబీవీ కాలేజీలన్ని ఈ నెల 17న తిరిగి రీ-ఓపెన్‌‌ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ఇక రాష్ట్రంలోని అన్ని రకాల పాఠశాలలకు మాత్రం అకడమిక్‌ క్యాలెండర్‌ ప్రకారం..  ఈ నెల 13వ తేదీ నుంచి 17వ తేదీ వరకు సెలవలు ప్రకటించింది తెలంగాణ సర్కార్.  అయితే.. ఈ సారి సంక్రాంతి పండుగ సండే, భోగి సెకండ్ సాటర్ డే రోజు రావడంతో స్టూడెంట్స్, గవర్నమెంట్ ఎంప్లాయిస్ నిరాశలో ఉన్నారు. సంక్రాంతికి స్పెషల్ హాలిడేస్ కోల్పోయామనే చాలా మందిలో ఉంది.  జనవరి 1ని నార్మల్ హాలి డే కింద పరిగణించింది ప్రభుత్వం. కానీ ఆ రోజు కూడా ఆదివారం ఖాతాలోకి వెళ్లింది.

వీకెండ్ ఎగ్జామ్స్ తప్పనిసరి కాదు

టెన్త్ క్లాస్ స్టూడెంట్స్‌కు ఆదివారం లేదా రెండో శనివారాల్లో వీకెండ్ ఎగ్జామ్స్ పెట్టాలని  ఇటీవల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా సెలవు రోజుల్లో వాటిని జరపాలని టీచర్స్ బలవంతం చేయరాదని సూచించింది.  అయితే మళ్లీ వాటిని ఎప్పుడు నిర్వహించాలో మాత్రం క్లారిటీ ఇవ్వలేదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..