ఇకపై మీ సేవ ద్వారా ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్‌కమ్ సర్టిఫికేట్) అందించేందుకు సిద్ధమవుతోంది తెలంగాణ ప్రభుత్వం. రెవెన్యూ శాఖలో మరిన్ని సంస్కరణలు చేపట్టేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. వీలైనంత ఎక్కువ టెక్నాలజీని ఉపయోగించుకుని, అవినీతికి అడ్డుకట్ట వేయాలని భావిస్తోంది. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం లంచాలు ఇవ్వాల్సి వస్తుందని ప్రజల నుంచి ఫిర్యాదులు రావడంతో.. మీసేవ కేంద్రాల ద్వారా జారీ చేయాలని భావిస్తోంది ప్రభుత్వం. దీంతో ఇకపై ప్రజలు నేరుగా అధికారులను కలిసే అవసరం రాకుండా కీలక పత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను శాశ్వత ప్రాతిపదికన మంజూరు చేయనున్నది. ప్రజలు నేరుగా అధికారులను కలిసే అవసరం లేకుండా కీలక పత్రాలన్నింటినీ ఆన్‌లైన్‌లోనే ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు అధికారులు. ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేకంగా ‘గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టమ్’ పేరుతో ఫిర్యాదులు, ఫీడ్ బ్యాక్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. ప్రజలు నేరుగా అందించే ఫిర్యాదులతో పాటు, సోషల్ మీడియా ద్వారా వచ్చే కంప్లైంట్స్ అన్నీ ఒకే చోటికి వచ్చేలా కామన్ ఫ్లాట్‌ఫామ్ ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం.
Read More:
విజయవాడ హోటల్ ప్రమాద ఘటనపై సీఎం జగన్ ఆరా