Farm House Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు..

|

Nov 08, 2022 | 6:10 AM

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఇవాళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. కేసు దర్యాప్తును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించే..

Farm House Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నేడు కీలక నిర్ణయం తీసుకోనున్న హైకోర్టు..
Ts Highcourt
Follow us on

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం కేసులో ఇవాళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. కేసు దర్యాప్తును సీబీఐ లేదా ప్రత్యేక దర్యాప్తు సంస్థకు అప్పగించే పిటిషన్‌ వేసే అర్హత బీజేపీకి ఉందా? లేదా? అన్నదానిపై ఉత్తర్వులు ఇవ్వనుంది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను సమర్పించాలని ఆదేశించింది. కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలంటూ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రేమేందర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ విచారణ చేపట్టనుంది.

హైదరాబాద్‌లో మరికొన్ని ఘటనలు..

హైదరాబాద్‌ అంబర్‌పేట్‌లో అర్థరాత్రి భారీ అగ్ని ప్రమాదం జరిగింది. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చేసే ఓ వ్యక్తి తన కారుతో డిడి కాలనీలోని ఇంటికి వచ్చారు. కారును కింద పార్క్‌ చేసి ఇంటిలోకి వెళ్లిపోయాడు. అంతే.. 10 నిమిషాల్లోనే కారులో మంటలు లేచాయి. క్షణాల్లోనూ పూర్తిగా కాలిపోయింది. పక్కనే ఉన్న మరో కారుకు కూడా మంటలంటుకోవడంతో కాలి పోయింది. స్పాట్‌కు చేరుకున్న ఫైర్‌ సిబ్బంది మంటలను ఆర్పి పరిస్థితిని చక్కదిద్దారు.

ప్రేమించిన అమ్మాయి దక్కదనే..

పాతబస్తీలో దారుణం జరిగింది. కుటుంబ కలహాలతో ప్రేమించిన అమ్మాయి పెళ్లికి దూరం అవుతుందన్న బెంగతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఓల్డ్‌ సిటీలోని తాలాపత్తర్‌లో జరిగింది. మహ్మద్‌ తబ్రేజ్‌ అలీ, స్థానికంగా ఉండే అమ్మాయితో ప్రేమయాణం సాగించారు. ఇద్దరి ఇళ్లలో కూడా పెళ్లికి ఒప్పుకున్నారు. తర్వాత కొన్ని రోజులకు రెండు కుటుంబాల మధ్య తలెత్తిన విభేదాల కారణంతో ప్రేమ పెళ్లిలో బ్రేక్‌ వచ్చింది. ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య రిలేషన్‌ నడుస్తూనే ఉంది. అయితే.. ఏమైందో ఏమో కాని.. అకస్మాత్తుగా ఇద్దరు వీడియో కాల్‌ మాట్లాడుకుంటూనే బాధితుడు లైవ్‌లోనే ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. స్పాట్‌కు చేరుకున్న పోలీసులు డెడ్‌బాడీని ఉస్మానియాకు తరలించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..