AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని ఇటీవల బీఆర్‌ఎస్ నేతలు కౌశిక్‌రెడ్డి, వివేకానందగౌడ్‌ పిటిషన్‌ వేశారు. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావుపై అనర్హత వేటు వేయాలని అందులో పేర్కొన్నారు. దానిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. కీలక తీర్పు వెల్లడించింది.

Telangana: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు
Telangana High Court
Ram Naramaneni
|

Updated on: Sep 09, 2024 | 1:13 PM

Share

బీఆర్‌ఎస్‌ నుంచి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలకు న్యాయస్థానంలో ఎదురుదెబ్బ తగిలింది. వారి అనర్హతపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్‌ కార్యాలయానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అప్పటిలోగా నిర్ణయం తీసుకోకపోతే సుమోటోగా కేసు విచారిస్తామని తెలిపింది.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్‌ను ఆదేశించాలని బీఆర్‌ఎస్  ఉన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై  అనర్హత వేటు వేయాలని హైకోర్టులో బీఆర్‌ఎస్ పిటిషన్ వేసింది. దానిపై విచారించిన ధర్మాసనం.. తాజా ఆదేశాలు జారీ చేసింది.

ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని BRS నేత హరీష్‌ రావు అన్నారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌ పార్టీ అనుసరిస్తున్న అప్రజాస్వామ్య విధానాలకు చెంపపెట్టని తెలిపారు. తెలంగాణ హైకోర్టు తీర్పుతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పడటం ఖాయమని హరీష్‌ రావు స్పష్టం చేశారు. అనర్హత కారణంగా ఉపఎన్నికలు జరిగే నియోజకవర్గాల్లో BRS గెలుపు తథ్యమని ఎక్స్‌ వేదికగా హరీష్‌ రావు తెలిపారు.

తాము పార్టీ మారినప్పుడు పార్టీని విలీనం చేశామని, కాని ఇప్పుడు కాంగ్రెస్‌ ప్రభుత్వంలో జరిగింది పార్టీ ఫిరాయింపని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. మూడు నియోజకవర్గాల్లో కచ్చితంగా ఉపఎన్నికలు వస్తాయని తెలిపారు.

అనర్హత పిటిషన్ల వ్యవహారంలో స్పీకర్‌కు ఇమ్యూనిటీ ఉండదని హైకోర్టులో BRS తరపున వాదనలు వినిపించిన ప్రముఖ న్యాయవాది గండ్ర మోహన్‌రావు అన్నారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించిన 24 గంటల్లోనే వారిపై అనర్హత వేటు వేసిన విషయాన్ని హైకోర్టు దృష్టికి తెచ్చినట్టు ఆయన తెలిపారు. హైకోర్టు ఆదేశాలను పాటిస్తూ నాలుగు వారాల్లోగా స్పీకర్‌ చర్యలు తీసుకుంటారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి. 

Follow Us