Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్పందించిన హైకోర్టు.. ఏమందంటే..

Telangana BJP MLA: తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల (Telangana assembly session) నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో (High Court) పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే...

Telangana BJP: తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై స్పందించిన హైకోర్టు.. ఏమందంటే..
Bjp Mlas

Updated on: Mar 11, 2022 | 2:49 PM

Telangana BJP MLA: తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాల నుంచి తమను సస్పెండ్ చేయడాన్ని సవాలు చేస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై గురువారం హైకోర్టులో వాదనలు ముగిసిన తర్వాత, ఇరు పక్షాల వాదనాలు విన్న న్యాయస్థానం తీర్పును రిజర్వ్‌ చేసిన విషయం విధితమే.

అయితే తాజాగా బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ ఎత్తివేయాలనే అంశంపై హైకోర్టు శుక్రవారం తీర్పును వెలవరించింది. బీజేపీ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటీషన్‌పై స్టే ఇవ్వలేమని హైకోర్టు తేల్చి చెప్పింది. సస్పెనక్షన్‌పై స్టే ఇవ్వడానికి రాష్ట్ర ఉన్నత న్యాయ స్థానం నిరాకరించింది. మరి సస్పెండ్ అయిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలు రాజాసింగ్‌, ఈటల రాజేందర్‌, రఘునంద్‌రావు హైకోర్టు తీర్పుపై ఎలా స్పందిస్తారో చూడాలి.

ఇదిలా ఉంటే తెలంగాణ శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు మార్చి 7న ప్రారంభంకాగా, అదేరోజు ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. అయితే బడ్జెట్ ప్రసంగానికి విఘాతం కలిగిస్తున్నారన్న కారణంగా బీజేపీ ఎమ్మెల్యేలు.. రాజాసింగ్, రఘునందన్‌రావు, ఈటల రాజేందర్‌ను బడ్జెట్ సెషన్‌ మొత్తం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. దీనిని సవాలు చేస్తూ ఆ ముగ్గురు హైకోర్టును ఆశ్రయించడంతో తాజాగా కోర్టు ఈ తీర్పును ఇచ్చింది.

Also Read: Shivani Rajasekhar: తనలోని మరో యాంగిల్ బయటపెట్టిన ‘రాజశేఖర్’ కూతురు శివాని.. క్యూట్‌నెస్ ఓవర్ లోడెడ్..

CM KCR: ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అస్వస్థత.. యశోదాలో వైద్య పరీక్షలు