Telangana: పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్‌-2ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

Telangana Group 2: హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, లిమిట్‌దాటి వ్యవహరించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పునర్‌ మూల్యాంకనం చేసి అర్హుల జాబితా నిర్ణయించాలని సూచించింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో తుది జాబితాను ప్రకటించాలని టీజీపీఎస్‌సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌ 1 పిటిషన్లపై..

Telangana: పదేళ్ల క్రితం నిర్వహించిన గ్రూప్‌-2ను రద్దు చేసిన తెలంగాణ హైకోర్టు

Updated on: Nov 18, 2025 | 10:25 PM

Telangana: గ్రూప్‌ 2 నోటిఫికేషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ప్రకటన చేసింది. 2015- 16లో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షను రద్దు చేస్తూ ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీచేసింది. హైకోర్టు ఆదేశాలను టీజీపీఎస్సీ ఉల్లంఘించిందని, లిమిట్‌దాటి వ్యవహరించిందని హైకోర్టు వ్యాఖ్యానించింది. పునర్‌ మూల్యాంకనం చేసి అర్హుల జాబితా నిర్ణయించాలని సూచించింది. ఈ ప్రక్రియ 8 వారాల్లో తుది జాబితాను ప్రకటించాలని టీజీపీఎస్‌సీని హైకోర్టు ఆదేశించింది. గ్రూప్‌ 1 పిటిషన్లపై విచారణ వచ్చే నెల 22కు వాయిదా వేసింది కోర్టు.

తీర్పు సమయంలో హైకోర్టు టీజీపీఎస్సీ వ్యవహార శైలిపై కూడా తీవ్ర ఆక్షేపణలు వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాలను సంస్థ ఉల్లంఘించడమే కాక, తన పరిధిని అధిగమించిన చర్యలు తీసుకుందని వ్యాఖ్యానించింది. ఎంపికల ప్రక్రియలో పారదర్శకత లోపించడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేసింది.