Telangana: తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలకు భారీ భద్రత.. ప్రత్యేక బస్సులు!

|

Oct 20, 2024 | 6:30 PM

బయోమెట్రిక్‌ కోసం ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలుస్తోంది. మేడ్చల్‌ గ్రూప్-1 పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ విధించనున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు..

Telangana: తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలకు భారీ భద్రత.. ప్రత్యేక బస్సులు!
Follow us on

తెలంగాణలో గ్రూప్‌-1 పరీక్షలకు భారీ భద్రత ఏర్పాటు చేయనుంది తెలంగాణ ప్రభుత్వం. అభ్యర్థుల ఆందోళనతో అలర్ట్‌ అయిన అధికారులు.. రేపటి నుంచి 27 వరకు గ్రూప్-1 పరీక్షలు నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్షా కేంద్రంలోకి ఎలాంటి అనుమతి ఉండదు. దివ్యాంగులకు ప్రత్యేకంగా గంట పాటు అదనపు సమయం కేటాయించనున్నారు అధికారులు. పరీక్ష హాల్‌, పరిసరాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. అలాగే బయోమెట్రిక్‌ కోసం ప్రత్యేక సిబ్బంది ఏర్పాటు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయగా, 31,383 మంది అభ్యర్థులు హాజరు కానున్నారని తెలుస్తోంది. మేడ్చల్‌ గ్రూప్-1 పరీక్షా కేంద్రం దగ్గర 144 సెక్షన్ విధించనున్నారు. ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.

దీనికోసం 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. జిల్లా కలెక్టర్ల పర్యవేక్షణలో ఏర్పాట్లు, పరీక్షలు నిర్వహించేందుకు సిద్దమైనట్లు తెలిపారు. 2011 సంవత్సరం తర్వాత గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు మళ్ళీ జరుగుతున్నాయని తెలిపారు. హైదరాబాద్ జిల్లాలో 8 , రంగారెడ్డి జిల్లాలో 11 , మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 27 మొత్తం 46 కేంద్రాలలో గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష హాల్, చీఫ్ సూపరింటెండెంట్ రూమ్, పరిసర ప్రాంతాలన్నింటిలోనూ సీసీ టీవీ లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే టీజీపీఎస్‌సీ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

ఈ పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుండి 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద వైద్య సదుపాయం కూడా ఉంటుందని, అన్ని కేంద్రాలకు ప్రత్యేక ఆర్టీసీ బస్సుల ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Ratan TATA: 9000 కోట్లు విరాళంగా ఇచ్చిన రతన్ టాటానే రూ.15 కోట్లు లంచం డిమాండ్ చేశారట.. ఎందుకో తెలుసా?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి