Telangana: రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. పోలీసుల తీరును తప్పుబట్టిన బండి సంజయ్‌..

కరీంనగర్‌‌లో శోభాయాత్ర రాజకీయ వివాదంగా మారుతోంది. హనుమాన్‌ భక్తులను లాక్కెళ్లడంపై పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.. ముందుగా హనుమాన్‌ మాలధారుడిని పోలీస్‌ వాహనం లాక్కెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. హనుమాన్‌ శోభాయాత్రలో జయదేవ్‌ అనే వ్యక్తి కత్తి పట్టుకుని వీరంగం చేయడంతో శోభాయాత్ర ఉద్రిక్తంగా మారింది.

Telangana: రాజకీయ వివాదంగా మారిన కరీంనగర్‌ శోభాయాత్ర.. పోలీసుల తీరును తప్పుబట్టిన బండి సంజయ్‌..
Karimnagar Incident
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 26, 2024 | 11:03 AM

కరీంనగర్‌‌లో శోభాయాత్ర రాజకీయ వివాదంగా మారుతోంది. హనుమాన్‌ భక్తులను లాక్కెళ్లడంపై పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.. ముందుగా హనుమాన్‌ మాలధారుడిని పోలీస్‌ వాహనం లాక్కెళ్లడంతో ఒక్కసారిగా పరిస్థితి మారింది. హనుమాన్‌ శోభాయాత్రలో జయదేవ్‌ అనే వ్యక్తి కత్తి పట్టుకుని వీరంగం చేయడంతో శోభాయాత్ర ఉద్రిక్తంగా మారింది. దీంతో జయదేవ్‌ అనే వ్యక్తితో సహా.. బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. అనంతరం పోలీసుల తీరును నిరసిస్తూ హనుమాన్‌ మాలధారులు ఆందోళనకు దిగారు. హనుమాన్‌ భక్తుడిని పోలీస్‌ వాహనం ఈడ్చుకుపోయినప్పుడు ఏమైనా జరిగే ఉంటే ఎవరి బాధ్యత అంటూ పోలీసులను భక్తులు నిలదీశారు.. పోలీసుల తీరును బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ తప్పుబట్టారు.

తెలంగాణ డీజీపీకి బీజేపీ ఎంపీ బండి సంజయ్‌ ఫోన్ చేశారు. హనుమాన్‌ భక్తుల ర్యాలీలో ఉద్రిక్తతపై ఫిర్యాదు చేశారు. భక్తులతో దురుసుగా ప్రవర్తించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని బండి సంజయ్‌ డిమాండ్ చేశారు.

బీజేపీ కార్యకర్తల తీరును కాంగ్రెస్‌ నేత కోమటిరెడ్డి నరేందర్‌ రెడ్డి తప్పుబట్టారు. మాలధారుల వల్ల సమస్యలేదు, బీజేపీ కార్యకర్త కత్తి తిప్పడంతోనే సమస్య వచ్చిందన్నారు నరేందర్‌రెడ్డి. సున్నిత ప్రాంతాల్లో ఇలాంటి చర్యలు సరికాదన్నారు.

ఆరుగురిపై కేసు నమోదు..

ఇదిలాఉంటే.. కరీంనగర్‌ ర్యాలీలో గొడవపై పోలీసుల సీరియస్ యాక్షన్ చేపట్టారు. పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని.. ఆరుగురు హనుమాన్‌ భక్తులపై కేసు నమోదు చేశారు. గొడవ జరిగిన ప్రాంతంలో సీసీ ఫుటేజ్ లను పరిశీలిస్తున్నారు.

బీజేపీకి సంబంధం లేదు..

కరీంనగర్‌ హనుమాన్‌ శోభయాత్ర ఘటనకు, బీజేపీకి ఎలాంటి సంబంధం లేదన్నారు ఆ పార్టీ నేత ప్రవీణ్‌రావు. కత్తి తిప్పిన వ్యక్తి బీజేపీ కార్యకర్త కాదని.. గుర్తు తెలియని వ్యక్తి ఎవరో పోలీసులే గుర్తించాలన్నారు. కేవలం హనుమాన్‌ భక్తులను అరెస్టు చేశారనే సమాచారంతో తాము పోలీస్‌స్టేషన్‌కి వెళ్లి వారిని విడుదల చేయించే ప్రయత్నం చేశామన్నారాయన. హనుమాన్‌ శోభయాత్రలో బీజేపీ కార్యకర్తలు ఎవ్వరూ లేరని, కావాలంటే సీసీ ఫుటేజీని పరిశీలించాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు ప్రవీణ్‌రావు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..