Governor Yadadri Tour: గవర్నర్ తమిళిసై యాదాద్రి పర్యటన.. స్వాగత కార్యక్రమంలో కనిపించని అలయ ఈవో!

|

Apr 02, 2022 | 6:12 PM

తెలంగాణలో ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయ పునర్ నిర్మాణం అనంతరం మొదటిసారిగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ యాదాద్రిలో పర్యటించారు.

Governor Yadadri Tour: గవర్నర్ తమిళిసై యాదాద్రి పర్యటన.. స్వాగత కార్యక్రమంలో కనిపించని అలయ ఈవో!
Governor Tamilisai Soundararajan
Follow us on

Governor visits Yadadri Temple: తెలంగాణలో ప్రముఖ దివ్యక్షేత్రం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి(Sri Laxmi Narasimha Swamy) వారి ఆలయ పునర్ నిర్మాణం అనంతరం మొదటిసారిగా తెలంగాణ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌(Tamilisai Soundararajan) యాదాద్రిలో పర్యటించారు. యాదాద్రికి చేరుకున్న గవర్నర్‌కు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్‌ దంపతులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ మండపంలో వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం సంప్రదాయాల ప్రకారం గవర్నర్‌ దంపతులకు ఆలయ ధర్మకర్త బి.నరసింహమూర్తి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఉగాది పండుగ పురస్కరించుకుని స్వామివారి దర్శనం చేసుకున్నట్లు గవర్నర్‌ తమిళసై తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని కోరుకున్నానని ఆమె తెలిపారు.

అయితే, ఆలయ పునర్ నిర్మాణం అనంతరం మొదటిసారిగా తెలంగాణ గవర్నర్‌ యాదాద్రి పర్యటనలో ఆలయ ఈవో గీతా కనిపించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ప్రొటోకాల్‌ ప్రకారం గవర్నర్‌కు ఈవో స్వాగతం పలకాల్సి ఉంటుంది. అయితే ఆమె సెలవులో ఉండటం వల్ల అందుబాటులో లేకపోవడంతో గవర్నర్‌ పర్యటన పూర్తయ్యే వరకు ఆలయ ధర్మకర్త నరసింహమూర్తి ఏర్పాట్లను చూసుకున్నారు. గవర్నర్‌ దంపతులు యాదాద్రి పర్యటనకు వచ్చిన సమయంలో ఆలయ ఈవో అందుబాటులో లేకపోవడం ఇప్పుడు పొలిటికల్ వర్గాల్లో హాట్‌టాఫిక్‌గా మారింది.

Read Also….  Minister KTR: ఢిల్లీ బీజేపీ కరెక్టా? సిల్లీ బీజేపీ కరెక్టా?.. వడ్లు కొంటారా? లేదా?.. కేంద్రానికి మంత్రి కేటీఆర్ సూటి ప్రశ్న!