
Indiramma Atmiya Bharosa Scheme: తెలంగాణ ప్రజలకు రేవంత్ సర్కార్ భారీ శుభవార్త అందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26 నుంచి రైతు భరోసా నిధులు విడుదల చేసేందుకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. సంక్రాంతికే రైతు భరోసా నిధులు విడుదల చేయాల్సి ఉన్నప్పటికీ.. కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. దీంతో జనవరి చివరి వారంలో రిలీజ్ చేసేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుతం సాగులో ఉన్న భూములకు ఎకరానికి రూ.6 వేల చొప్పున ప్రభుత్వం జమ చేయనుంది. అందరి రైతుల అకౌంట్లలో జమ చేయడానికి 10 రోజుల సమయం పట్టే అవకాశముంది. శాటిలైట్ సర్వే ఆధారంగా ప్రస్తుత యాసంగి సీజన్‌లో పంట సాగు చేస్తున్న భూములను ప్రభుత్వం గుర్తిస్తోంది. దీంతో పంట సాగు చేయని రైతులకు ఈ సారి రైతు భరోసా కట్ కానుందని తెలుస్తోంది.
ఇక రైతు భరోసాతో పాటు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా నిధులను కూడా ప్రభుత్వం జమ చేయనుంది. ఈ పధకం ద్వారా భూమి లేని రైతులు, కౌలు రైతులు, రైతు కూలీల అకౌంట్లో రూ.6 వేల జమ చేయనుంది. రిపబ్లిక్ డే సందర్బంగా జనవరి 26న ఈ పధకం నిధులు వారి అకౌంట్లో జమ చేయనుందని తెలుస్తోంది. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద ప్రతీ ఏటా రూ.12 వేలు ప్రభుత్వం అందిస్తోంది. రెండు విడతలుగా రూ.6 వేల చొప్పున ఇస్తోంది. ఈ పథకం వల్ల వ్యవసాయంపై ఆధారపడ్డ రైతు కూలీలతో పాటు కౌలు రైతులకు లబ్ది చేకూరనుంది. గత ఏడాది ఈ పథకంను ప్రారంభించగా.. ఈ ఏడాది కూడా సహాయం అందించేందుకు సిద్దమైంది. దాదాపు 12 లక్షల కుటుంబాలకు ఈ పథకం ద్వారా లబ్ది చేకూర్చనుంది. ఈ పథకం కింద లబ్ది పొందాలంటే ఎంపీడీవో ఆఫీసులో దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం అధికారులు పరిశీలించి లబ్దిదారుల జాబితాలో చేరుస్తారు.
-తెలంగాణ నివాసి అయి ఉండాలి
-తమ పేరుపై ఎలాంటి భూమి కలిగి ఉండకూడదు
-ఉపాధి హామీ పథకం కింద కనీసం 20 రోజులు పని చేసి ఉండాలి
-రేషన్ కార్డు కలిగి ఉండాలి
-ఒకే కుటుంబంలో ఒకరికి మాత్రమే నిధులు అందిస్తారు
-రేషన్ కార్డు
-రెసిడెన్షియల్ సర్టిఫికేట్
-ఆధార్ కార్డు
-ఎమ్మార్వో లేదా వీఆర్వో అందించే భూమి లేదని ధృవీకరించే డాక్యుమెంట్
-ఉపాధి హామీ జాబ్ కార్డ్
-బ్యాంక్ పాస్ బుక్
-పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు