Telangana: తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు.. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు..
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో భారీగా ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం రాష్ట్రంలో 29 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజీవ్ రతన్, పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య, ఆర్గనైజేషన్, లీగల్ అదనపు డీజీగా శ్రీనివాస్‌రెడ్డి, రైల్వే అదనపు డీజీగా శివధర్‌రెడ్డి, పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు, హోంగార్డు అదనపు డీజీగా అభిలాష బిస్తుకు అదనపు బాధ్యతలు అప్పగించారు. ఇక మహిళా భద్రత, షీటీమ్స్ అదనపు డీజీగా షికా గోయల్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయిన ఐపీఎస్ అధికారుల వివరాలు
హౌసింగ్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా రాజీవ్ రతన్
పోలీసు అకాడమీ డైరెక్టర్‌గా సందీప్ శాండిల్య
ఆర్గనైజేషన్, లీగల్ అదనపు డీజీగా శ్రీనివాస్‌రెడ్డి
రైల్వే అదనపు డీజీగా శివధర్‌రెడ్డి
పోలీసు సంక్షేమం, క్రీడల అదనపు డీజీగా అభిలాష బిస్తు
మహిళా భద్రత, షీటీమ్స్ అదనపు డీజీగా షికా గోయల్
పోలీసు కంప్యూటర్ సర్వీసెస్ అదనపు డీజీగా శ్రీనివాసరావుకు బాధ్యతలు
టీఎస్‌ఎస్‌పీ బెటాలియన్ అదనపు డీజీగా స్వాతి లక్రా
గ్రేహౌండ్స్ ఆక్టోపస్ అదనపు డీజీగా విజయ్ కుమార్
అగ్నిమాపక శాఖ డైరెక్టర్ జనరల్‌గా నాగిరెడ్డి
హైదరాబాద్ అదనపు (లా అండ్ ఆర్డర్)గా విక్రమ్ సింగ్ మాన్
సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఐజీగా స్టీఫెన్ రవీంద్రకు అదనపు బాధ్యతలు