AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు ప్రతీరోజూ పాలు.. ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఎప్పటినుంచంటే..?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని అమలు చేస్తుండగా.. ఇందులో భాగంగా మరో డెసిషన్ తీసుకున్నారు. బ్రేక్‌ఫాస్ట్‌లో పాలు కూడా అందించాలని నిర్ణయించారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు.

Telangana: స్కూల్స్, కాలేజీల్లో విద్యార్థులకు ప్రతీరోజూ పాలు.. ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఎప్పటినుంచంటే..?
Milk
Venkatrao Lella
|

Updated on: Apr 09, 2026 | 8:01 AM

Share

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో చదువుకునే విద్యార్థులకు శుభవార్త అందించింది. ఇక నుంచి వారికి పాలు కూడా అందించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని వీరికి అమలు చేస్తోండగా.. తాజాగా పాలు కూడా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు పాలు సరఫరా చేసే బాధ్యతలను విజయ డెయిరీ సంస్థకు అప్పగించింది. 1వ తేదీ నుంచి ఇంటర్ వరకు చదువుకునే పిల్లలకు వీటిని ఇవ్వనున్నారు. ఇందుకోసం విజయ డెయిరీకి పాల కోసం కూ.120 కోట్ల ఆర్డర్ ప్రభుత్వం ఇచ్చింది. ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌తో పాటు పాలు అందించాలని సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు.

జూన్ నుంచి ప్రారంభం

రానున్న విద్యాసంవత్సరం జూన్ నుంచే పాలు ఇచ్చే కార్యక్రమాన్ని మొదలుపెట్టాలని రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం విద్యాశాఖను సీఎం రేవంత్ తన వద్దే ఉంచుకున్నారు. దీంతో విద్యావ్యవస్థలో అనేక మార్పులు తీసుకొస్తున్నారు. విద్యార్థులకు విద్యతో పాటు పౌష్టికాహారం అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. విద్యార్థులు పౌష్టికాహారలోపంతో బాధపడకూడదనే ఉద్దేశంతో ఇప్పటికే ప్రభుత్వ స్కూళ్లల్లో మధ్యాహ్న భోజనంతో పాటు ఉదయం బ్రేక్ ఫాస్ట్ కూడా అందిస్తున్నారు. ఇప్పుడు మరింత పోషకాలు ఉండే ఆహారం అందించేందుకు పాలు ఇచ్చేందుకు సిద్దమయ్యారు. 2026-27 విద్యాసంవత్సరం మొదలుకానున్న జూన్ నుంచి ప్రభుత్వ స్కూల్స్, కాలేజీల్లో 1 నుంచి ఇంటర్ వరకు చదువుతున్న విద్యార్థులందరికీ బ్రేక్ ఫాస్ట్‌లో పాలు కూడా అందించనున్నారు.

టెట్రాప్యాకెట్లలో పాలు

టెట్రాప్యాకెట్లలో పాలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యార్థులకు నిత్యం 150 మిల్లీలీటర్ల నుంచి 200 మిల్లీలీటర్ల వరకు పాలు అవసరమని జాతీయ పోషకాహార సంస్థ చెబుతోంది. దీంతో ఆ మోతాదులో పాలను టెట్రాప్యాకెట్లలో విద్యార్థులకు అందించేందుకు ప్రభుత్వం సిద్దమవుతోంది. పాలు సరఫరాకు సంబంధించి విజయ డెయిరీ నుంచి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదనలు కోరగా.. పాలను సరఫరా చేసేందుకు విజయ డెయిరీ ముందుకొచ్చింది. ఇప్పటికే అంగన్ వాడీల్లోని పిల్లలకు విజయ డెయిరీ పాలను అందిస్తోంది. 3 నుంచి 5 ఏళ్ల చిన్నారులకు టెట్రాప్యాకెట్లలో పాలను పంపిణీ చేస్తోంది. 100 మిల్లీలీటర్ల పాలను అందిస్తున్నారు. ఇప్పుడు అదే విధానంలో స్కూల్, కాలేజీ విద్యార్థులకు కూడా అందించనున్నారు. కాగా మధ్యాహ్న భోజన పథకంలో చేపల కూరను కూడా అందించాలని ఇటీవల ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు మెనూలో దానిని చేర్చింది. పిల్లలకు ఆరోగ్యకరమైన భోజనం అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇక మెనూలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూ కొత్త పదార్ధాలను చేర్చుతోంది.

Follow Us
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
ఆన్‌లైన్ గేమ్ ఆడొద్దని మందలించినందుకు దారుణం.. హత్యకు గురైన మామ
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
MBBS విద్యార్థి ఆత్మహత్య? హైదరాబాద్ రామంతాపూర్‌లో విషాదం
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
గుడిలో గంట కొట్టడం వెనుక అసలు రహస్యం ఇదే! ఆధ్యాత్మికత వెనుక ఉన్న
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఈ షాకింగ్‌ ఘటన చూస్తే వణుకుపుట్టాల్సిందే..!
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
ఎయిర్‌పోర్ట్‌లో ప్రయాణికుడి బ్యాగులో గన్.. అంతలోనే కాల్పులతో..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
గంటకు 320 కి.మీ. వేగంతో నీటి అడుగున భారత్ తొలి బుల్లెట్ రైలు..
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
ఆస్తి ఆశతో దారుణ హత్యలు.. సీసీకెమెరాలో కిల్లర్ తల్లి, కొడుకు !
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
వందే భారత్ ఢీ కొని యువతి మృతి! మౌలాలి వద్ద విషాద ఘటన
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
బెడ్‌షీట్ల నుంచి చెమట, ముక్క వాసన వస్తోందా..? ఇలా క్లీన్ చేస్తే
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో
ఇరుముడి 'మల్లెపూల పల్లకి' సాంగ్ వచ్చేసింది.. లిరికల్ వీడియో