Dalit Bandhu Scheme: దళితులకు తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుక.. నాలుగు జిల్లాలకు ద‌ళిత‌బంధు నిధులు విడుద‌ల‌!

తెలంగాణలో దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది.

Dalit Bandhu Scheme: దళితులకు తెలంగాణ సర్కార్ న్యూ ఇయర్ కానుక.. నాలుగు జిల్లాలకు ద‌ళిత‌బంధు నిధులు విడుద‌ల‌!
Kcr

Updated on: Dec 21, 2021 | 8:25 PM

Funds to Dalit Bandhu Scheme: తెలంగాణలో దళితబంధు పథకం అమలులో భాగంగా ముందుగానే ప్రకటించినట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆదేశాలమేరకు నాలుగు జిల్లాలలోని నాలుగు మండలాలకు ఎస్సీ కార్పోరేషన్ నిధులను విడుదల చేసింది. నిధులను ఆయా జిల్లా కలెక్టర్ల ఖాతాల్లో జమ చేసింది. నాలుగు మండ‌లాల‌కు క‌లిపి మొత్తం రూ. 250 కోట్లు జ‌మ చేసిన‌ట్లు ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు. తెలంగాణ‌లోని ద‌ళితుల‌ను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు సీఎం కేసీఆర్ ద‌ళిత‌బంధు ప‌థ‌కాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా ప్ర‌వేశ‌పెట్టిన విష‌యం తెలిసిందే. ఇందులో నిధులు జ‌మ చేసిన‌ట్లు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

దళితబంధు పథకం కింద విడుదలైన నిధుల వివరాలుః

✔️సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమ‌ల‌గిరి మండలానికి రూ. 50 కోట్లు.

✔️ ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలోని చింతకాని మండలానికి రూ.100 కోట్లు.

✔️నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట కల్వకుర్తి నియోజకవర్గాల పరిధిలోని చారగొండ మండలానికి రూ. 50 కోట్లు.

✔️కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని నిజాం సాగర్ మండలానికి రూ. 50 కోట్లు.

ఆయా జిల్లాల కలెక్టర్ల ఖాతాల్లో తెలంగాణ షెడ్యూల్ కులాల ఫైనాన్స్ కార్పోరేషన్ మంగళవారం జమచేసింది.

Dalit Bandhu

Dalit Bandhu 1

Read Also….  PM Modi with CEOs: వ్యవసాయం.. ఫుడ్ ప్రాసెసింగ్ రంగాల్లో పెట్టుబడులు పెంచండి.. కంపెనీల సీఈవోలకు ప్రధాని మోడీ సూచన!