Telangana Government: సంక్రాంతి వేళ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్.. అందరూ చెక్ చేస్కోండి..

రైతులకు సంక్రాంతి వేళ తెలంగాణ సర్కార్ భారీ శుభవార్త అందించింది. సన్న బియ్యం వడ్లకు బోనస్ డబ్బులు విడుదల చేసింది. దీంతో వీటిని రైతుల బ్యాంక్ ఖాతాల్లో విడుదల చేసింది. పండుగకు ముందు విడుదల చేసి రైతులకు ఊరట ఇచ్చింది ప్రభుత్వం.

Telangana Government: సంక్రాంతి వేళ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. బ్యాంకు ఖాతాల్లోకి డబ్బులు రిలీజ్.. అందరూ చెక్ చేస్కోండి..
telangana government

Edited By:

Updated on: Jan 12, 2026 | 10:06 PM

సంక్రాంతి పండుగ వేళ తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పండుగ సందర్భంగా రాష్ట్రంలోని రైతులకు తీపికబురు అందించింది. రైతుల ఖాతాల్లోకి డబ్బులు విడుదల చేసింది. రైతులు పండించే సన్న బియ్యం వడ్లకు క్వింటాకు రూ.500 చొప్పున బోనస్ అందిస్తామంటూ రైతులకు గత ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఈ హామీని మేనిఫెస్టోలో కూడా పొందుపర్చింది. అందుకు అనుగుణంగా అధికారంలోకి రాగానే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. గత ఏడాది కూడా సన్నబియ్యం పండించిన రైతులకు బోనస్ అందించగా.. ఈ సారి కూడా అందించింది. ఈ మేరకు తాజాగా సన్నబియ్యం పండించిన రైతులకు తెలంగాణ ప్రభుత్వం నిధులు విడుదల చేసింది. క్వింటాకు రూ.500 చొప్పున రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేసింది. దీంతో పండుగ వేళ రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

500 కోట్లు విడుదల

సన్న బియ్యం వడ్లు పండించిన రైతులకు బోనస్ అందించేందుకు పౌరసరఫరాల శాఖ రూ.500 కోట్లు విడుదల చేసింది. వానాకాలంలో పండించిన రైతులకు ఈ నిధులు ఇచ్చింది. ఈ నిధులతో కలిసి ఇప్పటివరకు ఈ సీజన్‌లో మొత్తం రూ.1,429 కోట్ల నిధులను బోనస్ రూపంలో ప్రభుత్వం అందించినట్లయింది. సన్నబియ్యం పండించిన వారికి మద్దతు ధరతో పాటు బోనస్ ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు తాజాగా వానాకాలం సీజన్‌కు వీటిని విడుదల చేస్తూ నిర్ణయం తీసుకుంది. రైతులు వడ్లు విక్రయించిన తర్వాత వారి వివరాలను అధికారులు నమోదు చేసుకుంటున్నారు. వారికి మద్దతు ధరతో పాటు బోనస్ డబ్బులను బ్యాంక్ అకౌంట్లో వేస్తున్నారు. పండుగ వేళ చేతికి డబ్బులు రావడంతో రైతులు ఎగిరి గంతేస్తున్నారు. తెలంగాణను సన్నబియ్యంకు హాబ్‌గా మార్చాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోంది. అందుకు అనుగుణంగా వాటిని పండించిన వారికి బోనస్ ఇస్తోంది.

సన్న బియ్యం పండించేలా ప్రోత్సాహం

రైతులు దొడ్డు బియ్యం కంటే సన్న బియ్యం పండించేలా ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ బోనస్ పథకాన్ని ప్రవేశపెట్టింది. క్వింటాకు అదనంగా రూ.500 ఇస్తుండటంతో రైతులు సాగు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో తెలంగాణలో సన్న బియ్యం సాగు పెరుగుతోంది. రైతులు తమ బియ్యాన్ని విక్రయించుకునేందుకు గ్రామాల్లో ఐకేపీ సెంటర్లు, సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా రైతులు తమ వడ్లను అమ్ముకోవచ్చు. దళారుల చేతుల్లో రైతులు నష్టపోకుండా ఉండేందుకు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అక్కడ ధాన్యం విక్రయించిన కొద్ది రోజులకే రైతుల బ్యాంక్ అకౌంట్లలో నిధులు జమ చేసేలా ప్రణాళిక రూపొందించింది.