Telangana: ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..

|

Jun 19, 2023 | 10:32 PM

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ పెంచుతున్నట్లుగా ప్రకటించింది. 2.73 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు..

Telangana: ప్రభుత్వం ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. డీఏ పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్..
CM KCR
Follow us on

హైదరాబాద్, జూన్ 19: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు తెలంగాణ సర్కార్ తీపి కబురు చెప్పింది. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దశాబ్ధి ఉత్సవాల సందర్భంగా డీఏ పెంచుతున్నట్లుగా ప్రకటించింది. 2.73 శాతం డీఏ పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేశారు. జూన్ నెల వేతనంతో పెంచిన డీఏ చెల్లింపు జరుగనుంది. పెన్షనర్లతో సహా 7.28 లక్షల మందికి లబ్ధి చేకూరనుంది. డీఏ విడుదల చేస్తున్నట్లుగా తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి హరీష్ రావు ప్రకటించారు. అయితే పెంన్షనర్లు, ఉద్యోగుల అసలుపై 2.73 శాతం డీఏ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేశారు. 2022 జనవరి నెల నుంచి పెరిగిన ఈ అలవెన్సులు వర్తిస్తాయని ఉత్తర్వుల్లో తెలిపింది.

పెరిగిన డీఏ జూన్‌ నెల వేతనంతో కలిపి ఇవ్వనున్నట్లుగా మంత్రి హరీష్ రావు ఈ తాజా ప్రకటనలో తెలిపారు. డీఏ పెంపుతో రాష్ట్ర ప్రభుత్వంపై నెలకు రూ. 81.18 కోట్లు భారం పడుతుందని.. ఇలా ఏడాదికి రూ.974.16 కోట్ల బరువు పడనుందని మంత్రి హరీష్ రావు తెలిపారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం