Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ..

|

May 11, 2021 | 9:03 PM

Telangana Govt: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని..

Telangana Govt: తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. పదో తరగతి విద్యార్థులను పాస్ చేస్తూ జీవో జారీ..
Follow us on

Telangana Govt: తెలంగాణ వ్యాప్తంగా కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉన్న నేపథ్యంలో రాష్ట్ర సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్ వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని పదవ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేయాలని డిసైడ్ అయ్యింది. ఈమేరకు విద్యార్థులందరినీ పాస్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. విద్యార్థులకు ఎఫ్ఏ మార్కుల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పదవ తరగతి పరీక్ష ఫలితాలపై అభ్యంతరాలుంటే.. పరీక్ష రాసేందుకు అవకాశం కల్పిస్తామని జీవో ప్రభుత్వం స్పష్టం చేసింది.

అలాగే.. ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులను సెకండ్ ఇయర్‌కు ప్రమోట్ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇక రెండో సంవత్సరం పరీక్షల నిర్వహణపై జూన్ రెండో వారంలో సమీక్షించి నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్యాక్‌లాగ్ ఉన్న రెండో సంవత్సరం విద్యార్థులకు కనీస పాస్ మార్కులు వేస్తామని ప్రభుత్వం తెలిపింది. ఇదిలాఉండగా.. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా రాష్ట్రంలో పది, ఇంటర్మీడియట్ పరీక్షలను రద్దు చేస్తున్న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే తాజాగా పదవ తరగతి విద్యార్థులందరినీ పాస్ చేస్తూ జీవో జారీ చేసింది.

Also read:

Hyderabad Metro: లాక్ డౌన్ నేప‌థ్యంలో హైద‌రాబాద్ మెట్రో రైళ్ల‌ వేళల్లో మార్పులు.. తాజా టైమింగ్స్ ఇవే

Telangana Lockdown: తెలంగాణా లాక్ డౌన్ పై అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు.. ఏమన్నారంటే..

Police Case on Babu: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై గుంటూరు జిల్లాలో కేసు నమోదు.. కారణమేంటంటే..