దేశంలో కరోనా(Coronavirus) టెర్రర్ క్రియేట్ చేస్తోంది. రోజురోజుకు కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో కూడా కరోనా దడ పుట్టిస్తోంది. అయితే డబుల్ డోస్ వ్యాక్సిన్(Corona Vaccine) తీసుకున్నవారికి పెద్దగా ప్రమాదం లేదు. ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు తప్పితే.. మిగతా వారు త్వరగానే కోలుకుంటున్నారు. కాగా కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ఈనెల 30 వరకు తెలంగాణలో స్కూళ్లు బంద్ కాగా ప్రత్యామ్నాయ క్లాసులపై ఓ నిర్ణయానికి వచ్చింది ప్రభుత్వం. నేటి నుంచి ఆన్‌లైన్ క్లాసులు(Online Classes) నిర్వహించనున్నారు.
ఇదిలా ఉంటే తాజాగా తెలంగాణ సర్కార్(Telangana Government) ఆఫ్ లైన్ తరగతులపై కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 5 నుండి విద్యాసంస్థలకు పర్మిషన్ ఇవ్వాలని యోచిస్తోందట. రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై ఇప్పటికే ఆరోగ్య శాఖ.. ప్రభుత్వానికి ఓ నివేదిక ఇచ్చినట్లు సమాచారం. కరోనా వ్యాప్తి బట్టి ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ క్లాసులు ఉండే అవకాశం ఉందట. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 8 నుండి 16వరకు విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. కానీ కరోనా వ్యాప్తి తీవ్రత దృష్ట్యా ఆ తర్వాత జనవరి 30 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. గత ఏడాది కరోనా విద్యాసంస్థలపై తీవ్ర ప్రభావం చూపింది. స్కూల్స్, కాలేజీలు మూత పడటంతో ఆన్‌లైన్ క్లాసులతో సరిపెట్టుకున్నారు విద్యార్థులు. ఇక తాజాగా విద్యార్థులు మరో విద్యా సంవత్సరం(Academic Year) నష్టపోకూడదనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పరీక్షల రద్దు, ప్రమోట్ చేయడం వంటివి ఉండబోవని తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబిత తేల్చి చెప్పారు. దీనివల్ల విద్యార్థులు నష్టపోతారని ఆమె పేర్కొన్నారు. విద్యార్థులు ఇలాంటి ఆశలు పెట్టుకోకుండా వీలైనంత వరకూ పరీక్షల్లో విజయం సాధించేందుకు కష్టపడాలని సూచించారు.
Also Read: ఏడాదిన్నర బిడ్డ పక్కనుండగానే బీహార్ మహిళపై దాడి, అత్యాచారం.. తెల్లారేసరికి మృత్యు ఒడిలోకి
ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన మోటివేషనల్ స్పీకర్ ఆత్మహత్య.. ఎందుకంటే