AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IVF కేంద్రాలకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్.. తేడా వస్తే.. శాశ్వతంగా మూసివేత!

రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధం అయింది. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం అయింది వైద్య ఆరోగ్య శాఖ. అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసేందుకు సిద్ధం అయింది.

IVF కేంద్రాలకు తెలంగాణ సర్కార్ బిగ్ షాక్.. తేడా వస్తే.. శాశ్వతంగా మూసివేత!
Illegal Ivf Centres In Hyderabad
Yellender Reddy Ramasagram
| Edited By: |

Updated on: Nov 06, 2026 | 9:23 PM

Share

రాష్ట్రంలో ఐవీఎఫ్ కేంద్రాల ముసుగులో జరుగుతున్న అక్రమాలు, దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధం అయింది. అక్రమాలకు పాల్పడే ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలపై కఠినంగా వ్యవహరించేందుకు సిద్ధం అయింది వైద్య ఆరోగ్య శాఖ. అండాల అక్రమ సేకరణ ముఠాతో సంబంధాలున్న అన్ని ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాలను శాశ్వతంగా సీజ్ చేసేందుకు సిద్ధం అయింది. అక్రమాల్లో భాగస్వాములైన వైద్యుల లైసెన్సులను శాశ్వతంగా రద్దు చేసే అవకాశాలను కూడా పరిశీలిస్తున్నారు.

గతంలో సృష్టి ఫర్టిలిటీ సెంటర్‌లో జరిగిన అక్రమాలను ప్రభుత్వం అరికట్టిందని, తాజాగా అండాల అక్రమ సేకరణకు పాల్పడుతున్న ముఠాను గుర్తించి పట్టుకున్నామని మంత్రి దామోదర రాజనర్సింహా పేర్కొన్నారు. పోలీస్ శాఖతో సమన్వయం చేసుకుంటూ ఆరోగ్యశాఖ అధికారులు నిరంతర నిఘా, తనిఖీలు కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. కోఠిలోని టీజీఎంఎస్‌ఐడీసీ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ముషారఫ్ అలీ ఫారూఖీ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అండాల అక్రమ సేకరణ కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు మంత్రికి వివరించారు.

ఈ వ్యవహారంలో సంబంధం ఉన్న వ్యక్తులు, సంస్థలపై సమగ్ర విచారణ జరిపి, దోషులకు చట్టప్రకారం కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. దర్యాప్తులో పోలీస్ శాఖకు ఆరోగ్యశాఖ అధికారులు పూర్తి సహకారం అందించాలని సూచించారు. అక్రమాలకు పాల్పడిన వైద్యులపై చర్యల విషయంలో స్టేట్ మెడికల్ కౌన్సిల్, నేషనల్ మెడికల్ కౌన్సిల్ అధికారులతో సంప్రదింపులు జరిపి, నిబంధనల ప్రకారం వారి లైసెన్సుల రద్దుకు సిఫారసు చేయాలని స్పష్టం చేశారు.

సరోగసి, అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ చట్టాల అమలును మరింత పటిష్ఠం చేయడంపై మరింత దృష్టి సారించాలని మంత్రి సూచించారు. ఈ చట్టాల అమలులో ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలు, తీసుకుంటున్న చర్యలను అధ్యయనం చేసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీని ఆదేశించారు. దేశవ్యాప్తంగా అమలులో ఉన్న కేంద్ర చట్టాల పరిధిలోనే రాష్ట్ర స్థాయిలో అదనపు నియంత్రణ చర్యలు, మార్గదర్శకాలు రూపొందించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు.

ప్రైవేట్ ఐవీఎఫ్ కేంద్రాల కార్యకలాపాలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడే సంస్థలపై కఠినంగా వ్యవహరించాలని మంత్రి ఆదేశించారు. ఐవీఎఫ్ చికిత్సలో ఉపయోగించే మెడిసిన్ తయారీ నుంచి అమ్మకాల వరకూ ప్రత్యేకంగా నిఘా ఉండాలని డ్రగ్ కంట్రోల్ అథారిటీ అధికారులకు మంత్రి సూచించారు. సంతానలేమి సమస్యతో ఐవీఎఫ్ సేవలను ఆశ్రయించే దంపతులను లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దోపిడీ, అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని అధికారులకు మంత్రి స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉన్న సంతాన సాఫల్య చికిత్సా సేవలు పారదర్శకంగా, చట్టబద్ధంగా కొనసాగించేలా పటిష్ఠమైన పర్యవేక్షణ వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఐవీఎఫ్ సేవల విస్తరణ చర్యలు స్పీడప్ చేయాలని మంత్రి ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us