Telangana Model School Teachers: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు శుభవార్త అందించింది. కొత్త పీఆర్సీ వర్తింపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు కీలక ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో రాష్ట్రం లో 194 మోడల్ స్కూల్‌లో పనిచేస్తున్న 3,000 మంది ఉపాధ్యాయులకు ప్రయోజనం చేకూరనుంది. ఇందుకు సంబంధించిన ఫైలుపై ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు ఆమోదం తెలుపగా, విద్యాశాఖ కార్యదర్శి మోడల్ స్కూల్‌కు సంబంధించిన పీఆర్సీ జీవోను విడుదల చేశారు.
ఈ మేరకు ఆర్థిక శాఖమంత్రి హరీశ్ రావు, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పాతూరి సుధాకర్‌లకు మోడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు యాకమల్లు, ప్రధాన కార్యదర్శి నగేశ్ కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఆదర్శ పాఠశాలల్లో పనిచేస్తున్న టీచర్లకు కూడా నూతన వేతన సవరణను వర్తింప చేస్తూ ఆర్థికశాఖ ఆమోదం తెలిపింది.
మోడల్ స్కూల్ టీచర్స్ కొత్త పీర్సీకి సంబంధించి పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. RPS-2020 to model school
Read Also…