Scholarship Applications: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. విద్యార్థులు 2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవడానికి గడువును పెంచింది. ఫిబ్రవరి 15వ తేదీనే చివరి తేదీ కాగా, తాజాగా ఆ గడువును మార్చి 31 వరకు పొడిగించింది. అర్హులైన విద్యార్థులంతా ఈపాస్ వెబ్‌సైట్‌లో ఉపకార వేతనం కోసం దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. అలాగే రెన్యూవల్ చేసుకోని వారు కూడా రెన్యూవల్ చేసుకోవచ్చునని తెలిపింది. కాగా, తొలుత ఇచ్చిన గడువు సోమవారంతోనే ముగిసింది. అయితే వెబ్‌సైట్‌లో సాంకేతిక సమస్యల కారణంగా చాలా మంది విద్యార్థులు ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోలేకపోయారు. ఈ విషయాన్ని పలువురు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా.. ఉపకార వేతనాలకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
Also read:
తెలంగాణ సక్సెస్ ఫుల్ పథకాన్ని బెంగాల్‌లో తెచ్చిన సీఎం మమత, తిరిగి అధికారంలోకి వచ్చేందుకు అడుగులు