Yadadri: యాదాద్రి కొండపైకి స్వయంగా ఆటో నడుపుకుంటూ వెళ్లిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య

ఒక ప్రజా ప్రతినిధి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆటో డ్రైవర్‌గా మారిపోయారు. అది కూడా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్తుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కొండపైకి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆటో నడిపారు. యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావులను ఆటోలో ఎక్కించుకుని మరీ కొండపైకి తీసుకెళ్లారు.

Yadadri: యాదాద్రి కొండపైకి స్వయంగా ఆటో నడుపుకుంటూ వెళ్లిన ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య
Mla Beerla Ilaiah
Follow us

| Edited By: Balaraju Goud

Updated on: Feb 11, 2024 | 5:30 PM

ఒక ప్రజా ప్రతినిధి, అధికార పార్టీ ఎమ్మెల్యే ఆటో డ్రైవర్‌గా మారిపోయారు. అది కూడా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం, ప్రపంచ పర్యాటక కేంద్రంగా విరాజిల్తుతున్న యాదాద్రి లక్ష్మీ నరసింహ స్వామి కొండపైకి రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆటో నడిపారు. యాదాద్రి డీసీపీ రాజేష్ చంద్ర, యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావులను ఆటోలో ఎక్కించుకుని మరీ కొండపైకి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే ఎందుకు ఆటో నడిపాడు? ఆటోలో వారిని ఎందుకు తీసుకెళ్లాడు..? తెలుసు కోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే..!

యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని తెలంగాణ ప్రజలు ఇలవేల్పుగా భావిస్తుంటారు. గత ప్రభుత్వం యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి ఆలయాన్ని పునర్నిర్మించి ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దింది. అప్పటి నుంచి స్వామి వారి దర్శనం కోసం భక్తుల తాకిడి ఎక్కువైంది. దీంతో కొండపై వాహనాల రద్దీ, పర్యావరణ చర్యల్లో భాగంగా రెండేళ్లుగా స్వామి వారి కొండపైకి ఆటోలను అధికారులు నిషేధించారు. భక్తుల సౌకర్యార్థం దేవస్థానం ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించింది. కొన్ని ప్రత్యేకించి వాహనాలను మాత్రమే కొండపైకి అనుమతించారు.

దీంతో యాదగిరిగుట్టలో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోయారు. ఆటో డ్రైవర్లు ఎన్నో ఆందోళనలు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వస్తే ఆటోలను కొండపైకి అనుమతిస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. హామీని నిలబెట్టుకునే క్రమంలోనే యాదగిరిగుట్ట కొండపైకి ఆటోలను స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య జెండా ఊపి ప్రారంభించారు. అంతేకాదు తానే స్వయంగా ఆటో డ్రైవర్‌గా మారి యాదాద్రి డిసిపి రాజేష్ చంద్ర, ఆలయ ఈవో రామకృష్ణారావులను ఆటోలో ఎక్కించుకుని కొండపైకి తీసుకువెళ్లారు. యాదాద్రి కొండపై మెరుగైన వసతి సౌకర్యాలు కల్పనకు ప్రభుత్వం కృషి చేస్తోందని ఐలయ్య చెప్పారు.

యాదాద్రి టెంపుల్‌ అభివృద్ధి పేరుతో వెయ్యికి పైగా కుటుంబాలను రోడ్డున పడేశారని ప్రభుత్వ విప్‌ అయిలయ్య అన్నారు. నాలుగేళ్లుగా ఆటోలకు అనుమతి ఇవ్వకపోవడంతో ఉపాధి కోల్పోయారన్నారు. ఇచ్చిన మాట ప్రకారం యాదాద్రి కొండపైకి ఆటోలకు అనుమతించామని తెలిపారు. త్వరలోనే కొండపై దుకాణాలు కోల్పోయిన వాళ్లకూ న్యాయం చేస్తామని అయిలయ్య హామీ ఇచ్చారు.

ఇదిలావుంటే, యాదగిరిగుట్ట ప్రధానాలయం రీ ఓపెన్ సందర్భంగా గత ప్రభుత్వం.. 2022 మార్చి 28న కొండపైకి ఆటోలను నిషేధించింది. దీంతో ఆటో డ్రైవర్లు రిలే నిరాహార దీక్షలకు దిగారు. ఘాట్ రోడ్డు సమీపంలో యాదరుషి విగ్రహం వద్ద దాదాపుగా 20 నెలల పాటు దీక్షలు కొనసాగించారు. అసెంబ్లీ ఎన్నికల కోడ్ రావడంతో పోలీసుల సూచన మేరకు 2023 నవంబర్‌‌‌‌లో దీక్షలు విరమించారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలవడంతో ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య ఆటో డ్రైవర్లు, ఆలయ ఉద్యోగులు, పోలీసులతో పలు దఫాలుగా చర్చలు జరిపారు. సాధ్యాసాధ్యాలపై అధికారులతో సమీక్షించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఫిబ్రవరి 11 నుంచి కొండపైకి ఆటోలను అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో ఆటో డ్రైవర్ల రెండు సంవత్సరాల సుధీర్ఘ నిరీక్షణకు తెరపడింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
రూ. 15వేలలోపే సామ్‌సంగ్‌ నుంచి 5జీ ఫోన్‌.. ఫీచర్స్ కూడా సూపర్
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
బ్రష్‌ చేసేప్పుడు రక్తస్రావం అవుతోందా.? కారణం ఏంటో తెలుసా.?
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
ఎట్టకేలకు లాంచ్‌ అయిన షావోమీ 14 సిరీస్‌.. భారత్‌లో ఎప్పుడంటే..
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
టీవీ9పై ప్రశంసలు కురిపించిన ప్రధాని మోదీ.. దానికి ప్రతిబింబమంటూ
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
విహారీనే మా కెప్టెన్.. టీమిండియా క్రికెటర్‌కు అండగా సహచరులు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
మీ ఆహారంలోఈ ఆహారాలు తింటే హెల్తీ హెయిర్,మెరిసే చర్మం అందమైనగోర్లు
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
ఈ తప్పులు చేస్తే ఇంట్లో డబ్బు అస్సలు నిలవదు.. అవేంటంటే..
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
స్పూర్తిదాయకమైన వీడియో షేర్‌ చేసిన ఆనంద్‌ మహీంద్రా..! ఇదే చూస్తా
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
What India Thinks Today: మాది చేతల ప్రభుత్వం.. ప్రధాని మోదీ కీలక
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ
వారు దేశ ప్రజల సామర్థ్యాలను తక్కువగా అంచనా వేశారు: ప్రధాని మోదీ