Telangana Politics: తెలంగాణలో నయా రాజకీయం.. హాట్ టాపిక్‌గా జూపల్లి ఖమ్మం టూర్.. ఏం జరుగబోతోంది?..

|

Mar 09, 2022 | 7:50 AM

Telangana Politics: పాలమూరులో గులాబీ బాస్.. ఖమ్మంలో జూపల్లి కృష్ణరావు.. ఆ మాజీ మంత్రి ఖమ్మం టూర్ వెనుక మతలబ్ ఏంటి?.. అసంతృప్త గులాబి నేతలతో

Telangana Politics: తెలంగాణలో నయా రాజకీయం.. హాట్ టాపిక్‌గా జూపల్లి ఖమ్మం టూర్.. ఏం జరుగబోతోంది?..
Jupally
Follow us on

Telangana Politics: పాలమూరులో గులాబీ బాస్.. ఖమ్మంలో జూపల్లి కృష్ణరావు.. ఆ మాజీ మంత్రి ఖమ్మం టూర్ వెనుక మతలబ్ ఏంటి?.. అసంతృప్త గులాబి నేతలతో భేటీ వెనుక మర్మం ఏంటి?.. ఈ నెలలోనే జూపల్లి బృందం భవిష్యత్ కార్యాచరణపై ప్రకటన చేయబోతున్నారా? అంటే అవుననే అనిపిస్తుంది..

మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఖమ్మం ఖాహానిపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఒక వైపు ముఖ్యమంత్రి కేసీఆర్ పాలమూరు పర్యటనలో ఉండగా.. ఆ కార్యక్రమానికి హాజరు కావాల్సిన జూపల్లి ఖమ్మంలో ప్రత్యక్షమవ్వడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. టీఆర్ఎస్ నేత జూపల్లి కృష్ణారావు పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన పార్టీ మారుతారనే ప్రచారం కూడా జరుగుతూ వస్తోంది. అంతెందుకు.. గతంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సొంత పార్టీ టిఆర్‌ఎస్‌కు వ్యతిరేకంగా జూపల్లి పనిచేశారనే టాక్ గట్టిగానే ఉంది. ఇలాంటి తరుణంలో ఆయన ఖమ్మం రావడం, పార్టీలోని మరో అసమ్మతి నేతన కలుసుకోవడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

ఖమ్మం పర్యటన మతలబ్ అదేనా?..
ఖమ్మం పర్యటనలో జూపల్లి కృష్ణారావు భేటీ అయిన నేతల వివరాలు చూస్తే పక్కా పొలిటికల్ మీట్ అనేది అర్థమవుతోంది. ఎందుకంటే చాలా రోజులుగా పార్టీతో అంటీముట్టనట్లు ఉంటున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిలతో భేటీ అవ్వడం చూస్తే జూపల్లి కృష్ణారావు ఎదో పెద్ద స్కెచ్‌ వేశారనే చర్చ జోరందుకుంది. పార్టీలో ఎలాంటి పదవి లేకపోవడం, అటు జిల్లా మంత్రితో పాటు కొంత మంది నేతలతో పొసగక పోవడం, వాటికి తోడు ఈ మధ్యే ఎమ్మెల్యే రేగా కాంతారావుతో వివాదం లాంటి అంశాలతో ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి రగిలిపోతున్నారట. ఇక మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాలేరులో పార్టీ ఎమ్మెల్యే ఉండగానే మళ్ళీ పోటీ చెయ్యబోయేది గెలిచేది తానేనని ప్రకటనలు చేస్తూ.. పాలేరు ఎమ్మెల్యేతో నువ్వా నేనా అన్నట్టు వ్యవహరిస్తున్నారు. అటు సత్తుపల్లిలో పిడమర్తి కూడా పార్టీలో భవిష్యత్‌పై నమ్మకం లేదనే దృక్పథంతోనే ఉన్నారట. ఇవన్నీ గమనించిన జూపల్లి.. వీరందరితోనూ భేటీ అయ్యి రాజకీయ భవిష్యత్ కార్యాచరణపై చర్చించినట్లు తెలుస్తోంది. ఈ భేటీల తరువాత కొంతమంది తన అనుచరులతో ఈ నెల 15 తరువాత భవిష్యత్ కార్యాచరణ ఉంటుంది అని హింట్ కూడా ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే కాంగ్రెస్ నుండి టిఆర్‌ఎస్ కు వచ్చిన జూపల్లి.. తిరిగి సొంత గూటికి వెళ్తారా? లేక కమలంతో చేతులు కలుపుతారా? అనేది కొద్ది రోజుల్లోనే తేటతెల్లం కాబోతోంది.

Also read:

Zodiac Signs: ఈ 4 రాశులవారు పదేపదే ప్రేమలో పడుతుంటారు.. అందులో మీరున్నారా.!

Central Government: కేంద్రం మరో కీలక నిర్ణయం.. ఆ ప్రకటనలపై నిషేధం విధించే అవకాశం!!

Smart Phones: రూ. 5 వేలకే అదిరిపోయే స్మార్ట్‌ఫోన్‌.. మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్.. పూర్తి వివరాలివే..