Telangana: అదిగదిగో డబుల్ ఇంజన్ సర్కార్‌.. హ్యాట్రిక్ పక్కా.. 100 సీట్లు మావే.. ఆవిర్భావ దినోత్సవ వేళ తెలంగాణాలో పొలిటికల్ కాక

|

Jun 01, 2023 | 7:14 PM

తెల్లారితే అపూర్వ ఘట్టం... అట్టహాసంగా తెలంగాణా ఆవిర్భావ వేడుకలు. ఈ సందర్భంలోనే రాష్ట్ర రాజకీయం రక్తి కడుతోంది. పట్టుకోసం ప్రధాన పార్టీల మధ్య వెర్బల్ వార్ షురూ ఐంది. ఈసారి సెంచరీ కొడతామని బీఆర్ఎస్ అంటే... మీ కథ క్లయిమాక్స్‌లోకొచ్చేసింది అని సౌండ్ పెంచుతోంది బీజేపీ.

Telangana: అదిగదిగో డబుల్ ఇంజన్ సర్కార్‌.. హ్యాట్రిక్ పక్కా.. 100 సీట్లు మావే..  ఆవిర్భావ దినోత్సవ వేళ తెలంగాణాలో పొలిటికల్ కాక
Telangana Political
Follow us on

తెలంగాణాలో కేసీఆర్ సర్కార్ హ్యాట్రిక్ కొట్టడం ఖాయం అంటున్నారు మంత్రి కేటీఆర్. నీళ్లు, నిధులు, నియామకాల స్ఫూర్తికి అనుగుణంగానే తమ ప్రభుత్వం పనిచేస్తోందని, విద్య, వైద్య రంగాల్లో అద్భుతమైన మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో 90 నుంచి 100 స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరో చెప్పలేని పార్టీలు బీఆర్‌ఎస్‌కు పోటీయే కాదన్నారు. అమెరికా పర్యటన తర్వాత మీడియాతో జరిగిన చిట్‌చాట్‌లో కేటీఆర్ చేసిన కామెంట్లివి.

కానీ… తెలంగాణలో అధికార మార్పిడి తప్పదని, డబుల్ ఇంజన్ సర్కార్ తథ్యం అని ధీమాతో ఉంది బీజేపీ. అవినీతి సర్కార్‌ను తరిమేసే రోజు దగ్గర్లోనే ఉందన్నారు బీజేపీ తెలంగాణా ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్. నిజామాబాద్‌ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త రాకేశ్‌రెడ్డి బీజేపీలో చేరిన సందర్భంగా ఆయనీ మాటన్నారు.

సందర్భం దొరికినప్పుడల్లా బీజేపీ మీద సెటైర్లేసే మంత్రి హరీష్‌రావు… మోదీ సర్కార్‌ని మరోసారి టార్గెట్ చేశారు. కేంద్రంలో నడుస్తున్నది డబుల్ ఇంజన్‌ సర్కార్‌ కాదు… ఆయిల్ ఇంజిన్‌ సర్కార్‌ అంటున్నారు. సిద్ధిపేటలో ఓ కార్యక్రమంలో పాల్గొన్న హరీష్.. యూపీలో రాత్రి 7గంటల వరకే కరెంట్ ఇస్తారని, ఆ తర్వాత ఆయిల్ ఇంజిన్లే దిక్కని చెప్పుకొచ్చారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం కోసం ఓవైపు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. మరోవైపు పోటాపోటీ స్టేట్‌మెంట్స్‌తో పొలిటికల్ కాక రేపుతున్నాయి పార్టీలు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం