Telangana Formation Day Ceremony Updates: తెలంగాణ రాష్ట్రం ఏడు వసంతాలు పూర్తి చేసుకుని ఎనిమిదో వసంతంలోకి అడుగు పెట్టింది. దశాబ్దాల పాటు సుదీర్ఘ పోరాటం అనంతరం 2014 జూన్ 2న ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణ కోవిడ్ సెకండ్‌వేవ్ కొనసాగుతున్న నేపథ్యంలో ఈసారి నిరాడంబరంగానే వేడుకలు జరగనున్నాయి.
ఉదయం 8 గంటలకే…గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించనున్నారు. అనంతరం ప్రగతిభవన్‌లో జాతీయ పతాక ఆవిష్కరణ చేయనున్నారు. జిల్లా కేంద్రాల్లో మంత్రులు, ఇతర ప్రముఖులు అమరులకు నివాళులు అర్పించి ఆ తర్వాత జాతీయ పతాకావిష్కరణ చేస్తారు. అన్ని శాఖల ప్రభుత్వ కార్యాలయాల్లో ఉదయం ఎనిమిదిన్నర గంటలకే జాతీయ పతాకం ఆవిష్కరించాలని ప్రభుత్వం ఆదేశించింది. హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించనుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అమవీరుల స్థూపానికి పూలతో అందంగా అలంకరించారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రధాన కూడళ్లను విద్యుత్ దీపాలతో అలంకరించారు. సచివాలయ కార్యకలాపాలు కొనసాగుతున్న బీఆర్‌కే భవన్, శాసన సభ, శాసనమండలి భవనాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. అలాగే ఈ సందర్భంగా అసెంబ్లీలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
https://www.youtube.com/watch?v=B0jTCf3_q1s
అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని మంత్రి హరీశ్ రావు అన్నారు. తెలంగాణ కోసం పదవులతోపాటు కేసీఆర్ తన ప్రాణాలను కూడా పణంగా పెట్టారని అన్నారు. రాష్ట్ర ఎనిమిదో అవతరణ సంరద్భంగా సిద్దిపేట కలెక్టరేట్‌లో మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో తెలంగాణను ఆదర్శ రాష్ట్రంగా, దేశానికే రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దామన్నారు.
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రత్యేకమైన సంస్కృతితో అన్ని రంగాల్లో రాణిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజలు ఆరోగ్యం, శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేశారు.
Best wishes to the people of Telangana on the state’s Formation Day. The state is blessed with a unique culture and hardworking people who have excelled in many areas. Praying for the good health and well-being of the people of Telangana.
— Narendra Modi (@narendramodi) June 2, 2021
తెలంగాణ ఆవిర్భావం సందర్భంగా ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు తెలంగాణ నిలయమన్నారు.
తెలంగాణ ప్రజలకు రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు. ఘనమైన చరిత్ర, విశిష్ట సంస్కృతులకు నిలయమైన తెలంగాణ.. సహజ వనరులతో, నైపుణ్యం కల్గిన మానవ వనరులతో వివిధ రంగాల్లో గణనీయమైన ప్రగతిని, స్వయం సమృద్ధిని సాధిస్తూ దేశాభివృద్ధిలో తనవంతు పాత్రను కొనసాగించాలని ఆకాంక్షిస్తున్నాను. #Telangana
— Vice President of India (@VPSecretariat) June 2, 2021
తెలంగాణ రాష్ట్ర అవతరణ సందర్భంగా ప్రగతిభవన్‌లో వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేసి వందనం చేశారు. అలాగే అంతకు ముందు గన్‌పార్క్ అమరవీరుల స్థూపం వద్దకెళ్లి నివాళులర్పించారు. కరోనా పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రావతరణ వేడుకలు నిరాడంబరంగా జరుగుతున్నాయి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వేడుకలు జరుగుతున్నాయి. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ జెం
ప్రగతి భవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వేడుకల సందర్భంగా జాతీయజెండాను ఆవిష్కరించారు. కరోనా నిబంధనలకు లోబడి రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుపుకొంటున్నారు.
సిద్ధిపేటలోని కలెక్టరేట్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాష్ట్రాన్ని సాధించుకునేందుకు ఎన్నో పోరాటాలు చేశామని అన్నారు.
తెలంగాణ భవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ సెక్రెటరీ జనరల్ కేకే జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాంతి యుతంగా ఎన్నో ఏళ్లుగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని కేకే అన్నారు.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఈసారి నిరాడంబరంగానే కొనసాగుతున్నాయి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ వద్ద అమర వీరులకు నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వేడుకలు జరుగుతున్నాయి.
తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుగుతున్నాయి. గన్ పార్క్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ అమర వీరు స్థూపానికి నివాళులు అర్పించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఈసారి నిరాడంబరంగానే జరుగనున్నారు. కొద్ది సేపట్లో ముఖ్యమంత్రి కేసీఆర్ గన్ పార్క్ వద్ద అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.
హైదరాబాద్ గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపానికి ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులు అర్పించనుండటంతో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అమవీరుల స్థూపానికి పూలతో అందంగా అలంకరించారు.
తెలంగాణ రాష్ట్ర ఎనిమిదో అవతరణ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీలో వేడుకలు నిర్వహించారు. శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే అసెంబ్లీలో స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలపై కరోనా ప్రభావం పడింది. ఈ ఏడాది ఆవిర్భావ వేడుకలు నిరాడంబరంగానే జరగనున్నాయి. కోవిడ్ నిబంధనలకు లోబడి ఉత్సవాలు జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మరి కొద్ది సేపట్లో జరగనున్నాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ గన్‌పార్క్ వద్ద అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు