TSPSC Paper leak case: టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..

|

Mar 17, 2023 | 7:33 PM

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల వ్యవహారంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. తొలుత ఒక్క ప్రశ్నాపత్రం మాత్రమే లీకైనట్లు భావించినా సిట్‌ అధికారుల విచారణలో మరిన్ని ప్రశ్నాపత్రాలు..

TSPSC Paper leak case: టీఎస్‌పీఎస్సీ రద్దు చేసిన మొత్తం పరీక్షల లిస్టు ఇదే.. వాయిదా పడ్డ పరీక్షలేవంటే..
TSPSC Paper leak case
Follow us on

తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ నియామక పరీక్షల ప్రశ్నాపత్రాల వ్యవహారంలో తవ్వేకొద్దీ సంచలన విషయాలు బయటపడుతూనే ఉన్నాయి. తొలుత ఒక్క ప్రశ్నాపత్రం మాత్రమే లీకైనట్లు భావించినా సిట్‌ అధికారుల విచారణలో మరిన్ని ప్రశ్నాపత్రాలు ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ పెన్‌ డ్రైవ్‌లో కనుగొన్నారు. ఇప్పటికే అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పరీక్షను రద్దు చేసిన కమిషన్‌.. శుక్రవారం మరో మూడు పరీక్షలను రద్దు చేసింది. కాగా గతేడాది నుంచి ఇప్పటి వరకు 41 కేటగిరీల్లో 23వేల ఉద్యోగాలకు 26 నోటిఫికేషన్లను టీఎస్ పీఎస్సీ విడుదల చేసింది. వీటిల్లో ఇప్పటికే 7 పరీక్షలు నిర్వహించగా వీటిల్లో 4 పరీక్షలు రద్దు చేసింది. ఈ క్రమంలోనే ఇప్పటి వరకు ఏయే పరీక్షలు రద్దయ్యాయి.. ఏయే పరీక్షలు వాయిదా పడ్డాయో వంటి పూర్తి వివరాలు మీకోసం..

ఏఈ పరీక్ష రద్దు

దాదాపు 833 అసిస్టెంట్‌ ఇంజినీర్‌ (ఏఈ) పోస్టులకు 50 వేలకుపైగా అభ్యర్ధులు దరఖాస్తు చేస్తుకున్నారు. ఏఈ ప్రిలిమినరీ పరీక్ష ఈ ఏడాది మార్చి 5 జరిగింది. ఏఈ పరీక్ష క్వశ్చన్ పేపర్ లీక్ అయిందని సిట్‌ అధికారుల విచారణలో బయటపడటంతో ఈ పరీక్షను రద్దు చేశారు.

గ్రూప్ 1 ప్రిలిమ్స్ రద్దు

503 పోస్టులకు గతేడాది అక్టోబర్ 16న గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 2,85,916ల మంది హాజరయ్యారు. ప్రవీణ్‌కు 103 మార్కులు రావడంపై అనుమానం వచ్చిన అధికారులు దర్యాప్తు చేపట్టడంతో.. ఈ పరీక్ష పత్రం కూడా ప్రధాన నిందితుడు ప్రవీణ్‌ పెన్‌ డ్రైవ్‌లో లభ్యమైంది. అన్ని సక్రమంగా జరిగి ఉంటే జూన్ 11న గ్రూప్ 1 మెయిన్స్‌ జరగాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఏఈఈ పరీక్ష రద్దు

1540 పోస్టుల భర్తీకి జనవరి 1న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఏఈఈ) పరీక్ష జరగింది. ఈ పరీక్షకు 81,548 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఈ రోజు ఏఈఈ పరీక్షను కూడా రద్దు చేస్తున్నట్లు కమిషన్‌ ప్రకటించింది.

డీఏఓ పరీక్ష రద్దు

53 డివిజనల్ అకౌంట్ ఆఫీసర్ పోస్టులకు ఫిబ్రవరి 26న పరీక్ష నిర్వహించారు. 1,06,253 మంది అభ్యర్థులు హాజరయ్యారు.

జూనియర్ లెక్చరర్ ఎగ్జామ్స్ వాయిదా

1392 జూనియర్ లెక్చరర్ పోస్టులకు జనవరి 10న నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ లేదా జులైలో ఆ పరీక్ష నిర్వహించే అవకాశం ఉండేది. టీఎస్పీఎస్సీ పేపర్ లీక్ కారణంగా జూనియర్ లెక్చరర్ పరీక్షను వాయిదా వేసింది.

టౌన్ ప్లానింగ్ అప్లికెంటెంట్‌ పరీక్ష వాయిదా

175 టౌన్ ప్లానింగ్ పరీక్ష కోసం 55,000 మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్ష తేదీని ప్రకటించేలోపే ప్రశ్నాపత్రాల లీకుల కారణంగా పరీక్షను రద్దు చేశారు.

వెటర్నరీ అసిస్టెంట్, ఎంవీఐ పరీక్షలు పరీక్షలు కూడా వాయిదా పడ్డాయి. ప్రవీణ్‌ వద్ద ఉన్న నాలుగు పెన్‌డ్రైవ్‌లలో 60 నుంచి 70 జీబీల సమాచారం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మరిన్ని పరీక్షలు వాయిదా, మరికొన్ని రద్దు చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం.

మరిన్ని తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.