YS Sharmila New Party: తెలంగాణ వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందన ఇదీ..

YS Sharmila New Party: తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ షర్మిల చేస్తోన్న ప్రయత్నాలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి..

YS Sharmila New Party: తెలంగాణ వైఎస్ షర్మిల కొత్త పార్టీ.. ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందన ఇదీ..
File Photo

Updated on: Feb 10, 2021 | 8:21 PM

YS Sharmila New Party: తెలంగాణలో కొత్త పార్టీ ఏర్పాటు చేసేందుకు వైఎస్ షర్మిల చేస్తోన్న ప్రయత్నాలపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీష్ రావు స్పందించారు. తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకోస్తామంటూ షర్మిల చేసిన వ్యాఖ్యలపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అసలు వాళ్లకు తెలంగాణపై కనీస పరిజ్ఞానం ఉందా అని ఎద్దేవా చేశారు. బుధవారం నాడు సంగారెడ్డి జిల్లాలలోని కంది గ్రామంలో రైతు వేధికను మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటుపై తీవ్రంగా స్పందించారు. ఎక్కడి నుంచో వచ్చి తెలంగాణ రైతులకు అన్యాయం జరుగుతోందని మాట్లాడుతున్నారు.. తెలంగాణ గురించి వారికి కొంచెమైనా తెలుసా? అని ప్రశ్నించారు. రాజన్న రాజ్యం అంటూ మొసలి కన్నీరు కారుస్తున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ రాష్ట్రంలో రైతులకు అన్ని విధాలుగా అండగా ఉంటోందని, ఏపీలో అలా జరుగుతోందా? అని ప్రశ్నించారు. ఏపీలో రైతులకు ఎంత భూమి ఉన్నా కేవలం రూ. 12,500 మాత్రమే ఇస్తున్నారని పేర్కొన్న మంత్రి హరీష్ రావు.. తెలంగాణ ఎకరానికి పదివేల చొప్పున ఎన్ని ఎకరాలు ఉంటే అన్ని ఎకరాలకు రైతు బంధు అందజేస్తున్నామని చెప్పారు. ఎవరో వచ్చి ఏదో చేస్తామంటే నమ్మే స్థితిలో తెలంగాణ ప్రజలు లేరని అన్నారు.

Also read:

అన్నదాతల ‘ఉగ్ర రూపం’, ఈ నెల 18 న దేశవ్యాప్తంగా 4 గంటలపాటు రైల్ రోకో ఆందోళన

Crocodile Attack on Deer: బిడ్డ కోసం తన ప్రాణాన్ని అడ్డేసిన తల్లి.. మొసలికి ఆహారంగా మారి తల్లి జింక బలి..