Harish Rao: హ‌రీశ్ రావుకు డబుల్ ఆఫర్.. ఆర్థిక శాఖతో పాటు వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావుకు అద‌నంగా వైద్యారోగ్య‌ శాఖ అప్ప‌గిస్తూ తెలంగాణ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

Harish Rao: హ‌రీశ్ రావుకు డబుల్ ఆఫర్.. ఆర్థిక శాఖతో పాటు వైద్యారోగ్య శాఖ అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ
Harish Rao

Updated on: Nov 09, 2021 | 9:29 PM

Minister Harish Rao: తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీశ్ రావుకు అద‌నపు శాఖ అప్పగించారు ముఖ్యమంత్రి కేసీఆర్. రాష్ట్ర వైద్యారోగ్య‌ శాఖను కూడా ఆయనకు అప్పగిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వ‌ర‌కు ఆర్థిక శాఖ‌ మంత్రిగా కొనసాగుతున్న హ‌రీశ్ రావు వైద్య ఆరోగ్య శాఖను కూడా ప‌ర్యవేక్షిస్తారు. ఇక నుంచి రెండు శాఖ‌ల‌ బాధ్యతలను హరీశ్ రావు చేపట్టనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన ఉత్తర్వులో పేర్కొంది.

మే నెలలో ఈటల రాజేందర్‌ను బర్తరఫ్‌ చేశాక.. గత ఆరు నెలలుగా కేసీఆర్‌ దగ్గరే ఆరోగ్యశాఖ ఉంది.
కరోనా సెకండ్‌వేవ్‌లో ఆరోగ్యశాఖపై హరీష్‌ రావు మానిటరింగ్‌ చేస్తున్నారు. ఇప్పుడు అధికారికంగా ఆరోగ్యశాఖను కేటాయించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌.

Read Also.. Rafale deal: ఫ్రెంచి పోర్టల్ వార్తతో రఫేల్‌ విమానాల డీల్‌పై మళ్లీ రగడ.. కాంగ్రెస్‌-బీజేపీ మధ్య మాటల యుద్ధం!