Bonalu Festival: బోనాలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. 30న గోల్కొండలో తొలి బోనం..!

Bonalu Festival: రాష్ట్ర పండుగ బోనాల జాతరకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ నెల 30 గోల్కొండ బోనాలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు అట్టహాసంగా

Bonalu Festival: బోనాలకు ముస్తాబవుతున్న భాగ్యనగరం.. 30న గోల్కొండలో తొలి బోనం..!
Bonalu

Edited By:

Updated on: Jul 09, 2022 | 5:37 PM

Bonalu Festival: రాష్ట్ర పండుగ బోనాల జాతరకు భాగ్యనగరం ముస్తాబవుతోంది. ఈ నెల 30 గోల్కొండ బోనాలతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. నెల రోజుల పాటు అట్టహాసంగా వేడుకలు జరగనున్నాయి. ఈసారి బోనాలను అంగరంగవైభవంగా నిర్వహించేందుకు ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బోనాలు. భాగ్యనగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తారు. ఏటా ఆషాడ మాసంలో జరుపుకునే బోనాల కోసం యావత్ తెలంగాణ సమాజం ఎదురుచూస్తుంటుంది. చిన్నా, పెద్దా తేడా లేకుండా నెత్తిన బోనమెత్తుకొని భక్తిశ్రద్ధలతో అమ్మకు బోనం సమర్పిస్తారు. గోల్కొండ కోట నుంచి మొదలై.. దాదాపు నెలరోజులపాటు అంగరంగ వైభవంగా జరుగుతాయి బోనాల సంబురాలు. అయితే కరోనాతో రెండేళ్ల నుంచి నిరాడంబరంగా బోనాలు సాగాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మాత్రం అట్టహాసంగా నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మంత్రులు బోనాలపై సమీక్ష నిర్వహించి తేదీలను ఖరారు చేశారు.

దీని ప్రకారం.. ఈ నెల 30న గోల్కొండ బోనాల‌తో ఆషాఢ భోనాలు ప్రారంభం కానున్నాయి. దీంతో బోనాలకు ముస్తాబవుతోంది గోల్కొండ కోట. పెద్ద సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లుచేస్తున్నారు అధికారులు. ఇక జులై 17న ఉజ్జయిని మ‌హంకాళి అమ్మవారి బోనాలు, 18న రంగం, భ‌విష్యవాణి కార్యక్రమం నిర్వహించ‌నున్నారు. జులై 24న భాగ్యన‌గ‌ర బోనాలు, 25న ఉమ్మడి దేవాల‌యాల ఘ‌ట్టాల ఊరేగింపు నిర్వహిస్తారు. జులై 28న బోనాల జాతర ముగియ‌నుంది.

బోనాల జాతరపై సమీక్ష నిర్వహించిన మంత్రులు..బోనాల పండగ ఏర్పాట్లతో పాటు బందోబస్తుపైనా చర్చించారు. ఈ ఏడాది బోనాల జాతరను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లుచేస్తున్నట్టు ప్రకటించారు హైదరాబాద్‌ మత సామరస్యానికి..తెలంగాణ జన జీవన సాంస్కృతిక వైభవానికి ప్రతీకలైన బోనాల పండుగను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. ఈ ఏడాది అంగరంగ వైభవంగా జరిపేలా చర్యలు చేపట్టింది.