
Andesri Passed Away: ప్రముఖ రచయిత అందెశ్రీ (64) కన్నుమూశారు. లాలాగూడలో ఇంట్లో అకస్మాత్తుగా పడిపోవడంతో కుటుంబ సభ్యులు వెంటనే గాంధీ ఆస్పత్రికి తరలించారు. అందెశ్రీ జనగాం దగ్గరున్న రేబర్తి అనే గ్రామంలో జన్మించారు. ఆయన అసలు పేరు అందె ఎల్లయ్య. అందెశ్రీ రచించిన జయజయహే తెలంగాణ గీతం రచించారు.
ఈ ఏడాది జూన్ 2న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కోటిరూపాయల నగదు పురస్కారం అందుకున్నారు.