
మామిడిపండు, ఊరగాయ పచ్చడి, ఈ రెండు ఇష్టపడని వారు ప్రపంచంలో ఎక్కడ ఉండరేమో..! ఇలాంటి మామిడి మొక్కల నర్సరీలు ఎక్కడ ఉన్నాయో.. ఈ నర్సరీల వల్ల ఎంతో మంది జీవనోపాధి పొందుతున్నారో తెలుసా..! దేశంలోని వివిధ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న మామిడి మొక్కల నర్సరీల గురించి తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే!
రెండు తెలుగు రాష్ట్రాలలో పూల మొక్కలకు ఆంధ్రప్రదేశ్‌లోని కడియం ప్రాంతం ప్రసిద్ధి. కానీ ఉభయ రాష్ట్రాలలో మామిడి, జీడీ, జామ, కొబ్బరి మొక్కల నర్సరీలకు మాత్రం తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అంతే ఫేమస్. జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాలు మొక్కల పెంచుతున్నారు. దీంతో ఎంతో మంది రైతులకు, కూలీలకు ఉపాధినిస్తూ, మామిడి మొక్కల నర్సరీలకు హబ్‌గా మారింది
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వారావుపేట, దమ్మపేట మండలాల్లో సుమారుగా రెండు వందలకు పైగా మామిడి మొక్కల నర్సరీలు ఉన్నాయి, ఈ నర్సరీల నుండి నిత్యం దేశంలోని అనేక రాష్ట్రాలకు ఈ మొక్కల సరఫరా జరుగుతుంది. ఈ ప్రాంతాలలో ఉన్న నర్సరీలలో సుమారు 20 రకాల మొక్కలు లభిస్తాయి. ఎంతో మందికి నోరురించే బంగినపల్లి, పెద్దరసం, చెరుకు రసం, పంచదార రకం, ఊరగాయ పచ్చడికి కావలిసిన చిన్నరసం, కొత్తపల్లి కొబ్బరి, నాటు కాయలు, హైదర్ సాహెబ్ రకాల మామిడి మొక్కలు అందుబాటులో ఉన్నాయి. ఇవే కాకుండా, మార్కెట్‌లో దొరికే కలెక్టర్ రకాలతో పాటు అనేక రకాల మొక్కలు ఈ నర్సరీలలో లభిస్తున్నాయి.
అశ్వారావుపేట నియోజకవర్గం ఏజెన్సీ ప్రాంతం కావటంతో.. ఇక్కడ గిరిజనులు వ్యవసాయం చేసే స్తొమత లేకపోవటం, ఈ పొలాల్లో వర్షశాతం ద్వారా మాత్రమే అధికంగా పత్తి, మొక్కజొన్న పంటలు, వేసే వారు. కానీ ఈ మండలాల్లో ఉన్న భూములలో ఎర్రమట్టి చాలా సారవంతమైన మట్టి కావటంతో, ఈ మట్టి మామిడి మొక్కలకు ఉపయోగపడుతోంది. దీంతో రైతులు మామిడి మొక్కల నర్సరీలు ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. సంవత్సర కాలం ఈ మొక్కల తయారీ ఉంటుందని, మహిళ రైతులు కూడా ఈ నర్సరీలను ఏర్పాటు చేస్తున్నారు. అంతే కాకుండా కొన్ని వందల మంది కూలీలకు జీవనోపాధి ఉంటుందని,తమకు లాభదయాకంగా నర్సరీ యజమానులు తెలిపారు
అంతేకాకుండా ఈ రెండు మండలాల్లో మామిడి మొక్కల నర్సరీలతో పాటు, జీడీ, కొబ్బరి, జామ మొక్కల నర్సరీలు ఉండటం, అనేక రాష్ట్రాల నుండి ఈ ప్రాంతాలకు రైతులు వచ్చి మొక్కలను కొనుగోలు చేస్తుందటంతో, ఈ ప్రాంతం మామిడి మొక్కల హబ్ గా మారింది. తోట పెంపకంతో ఆర్థిక స్వాలంభన పొందుతున్నామని అన్నదాతలు చెబుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..