Etela Rajender: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. భూ కబ్జా ఆరోపణలు ఎదుర్కొని తెలంగాణ మంత్రివర్గం నుంచి బర్తరఫ్‌కు గురైన మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లారు. ఈటల బీజేపీలో చేరతారంటూ గత కొద్ది రోజులుగా జరుగుతున్న ప్రచారానికి.. ఇవాళ ఆయన ఢిల్లీకి వెళ్లడం మరింత ఊతమిస్తోంది. కాగా, ఈటల రాజేందర్ వెంట ఏనుగు రవీందర్ రెడ్డి, బీజేపీ నేత వివేక్ కూడా ఢిల్లీకి వెళ్లారు. బీజేపీలో చేరికపై బీజేపీ అగ్ర నేతలతో మంతనాలు జరిపేందుకు ఈటల రాజేందర్ ఢిల్లీకి వెళ్లినట్లు తెలంగాణ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది.
Also read:
జూన్ నెలలో 12 కోట్ల డోసులతో బృహత్తర జాతీయ వ్యాక్సినేషన్ కార్యక్రమం.. .కేంద్రం.. టీకామందుల లభ్యతలో కొరత ఉండబోదని భరోసా
Lovers Suicide: కృష్ణా జిల్లాలో విషాదం.. బలవన్మరణానికి పాల్పడిన ప్రేమికులు.. ఉరి వేసుకుని..