Telangana Congress: షబ్బీర్‌ అలీకి దక్కని టికెట్.. కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి..! కాంగ్రెస్ స్కెచ్ ఏంటి..?

Telangana Elections: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అనేక పరిణామాలు.. చర్చల అనంతరం రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 55, రెండో విడతలో 45 సీట్లను విడుదల చేసింది. అయితే, రెండో విడత అభ్యర్థుల ప్రకటన అనంతరం.. పార్టీలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి.

Telangana Congress: షబ్బీర్‌ అలీకి దక్కని టికెట్.. కామారెడ్డి బరిలో రేవంత్ రెడ్డి..! కాంగ్రెస్ స్కెచ్ ఏంటి..?
Telangana Congress

Updated on: Oct 28, 2023 | 8:23 AM

Telangana Elections: తెలంగాణ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. ఈ క్రమంలో ఎలాగైనా అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీ.. అనేక పరిణామాలు.. చర్చల అనంతరం రెండో విడత అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. మొదటి విడతలో 55, రెండో విడతలో 45 సీట్లను విడుదల చేసింది. అయితే, రెండో విడత అభ్యర్థుల ప్రకటన అనంతరం.. పార్టీలో అసంతృప్తులు భగ్గుమంటున్నాయి. ఈ తరుణంలో కామారెడ్డి సీటు హాట్ టాపిక్ గా మారింది. బీఆర్ఎస్ అధినేత సీఎం కేసీఆర్ ఇక్కడ పోటీ చేస్తున్నారు. అయితే, మొదటినుంచి తనకే టికెట్ వస్తుందని షబ్బిర్ అలీ పేర్కొంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం విడుదల చేసిన రెండోజాబితాలో షబ్బీర్‌అలీకి చోటు దక్కలేదు. కామారెడ్డి నుంచి ఎవరిని పోటీ చేయించాలనే విషయంలో కాంగ్రెస్‌ పార్టీలో అయోమయం ఉన్నట్లు తెలుస్తోంది. తొలుత షబ్బీర్‌అలీకి టికెట్‌ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అయితే, అనూహ్యంగా ఆయన పేరు కాంగ్రెస్‌ రెండో జాబితాలో ప్రకటించలేదు.

దీంతో కామారెడ్డినుంచి ఎవరు పోటీ చేస్తారనే విషయంలో సస్పెన్స్‌ కొనసాగుతోంది. కామారెడ్డి నుంచి సీఎం కేసీఆర్‌పై టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌ను పోటీకి దించే యోచనలో కాంగ్రెస్‌ పార్టీ ఉన్నట్లు తెలుస్తోంది. షబ్బీర్‌ అలీకి నిజామాబాద్‌ అర్బన్‌ కేటాయిస్తారని ప్రచారం జరుగుతోంది. లిస్ట్ లో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ను పెండింగ్‌లో ఉంచడంతో పార్టీలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. మరోవైపు నిజామాబాద్ అర్బన్‌ టికెట్‌ ఆశించిన తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఇటీవలే ఢిల్లీకి పిలిపించింది. సీటు కేటాయింపుపై పట్టు వీడాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ఆయనకు నచ్చచెప్పారు. మహేశ్‌ గౌడ్‌ ఓకే చెప్పడంతో నిజామాబాద్‌ అర్బన్‌ టికెట్‌ షబ్బీర్‌ అలీకి కేటాయించడానికి లైన్‌ క్లీయర్‌ అయిందని సమాచారం. ఇదిలాఉంటే.. కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి తప్ప మిగతా అన్ని చోట్లా అభ్యర్థుల వివరాలు పెండింగ్ లో ఉంచడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.

ఆత్మహత్యాయత్నం..

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్‌ సుభాష్ రెడ్డికి దక్కకపోవడంతో మనస్తాపం చెందిన నాగిరెడ్డిపేట యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రాకేష్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఎల్లారెడ్డి గాంధీచౌక్ లో ఒంటిపై పెట్రోల్ పోసుకున్నారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత నెలకొంది. విషయం తెలుసుకున్న పార్టీ మండల అధ్యక్షులు జనార్దన్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు హఫీజ్ గాంధీచౌక్‌ చేరుకుని రాకేష్‌ను అడ్డుకున్నారు.సుభాష్‌ రెడ్డికి టికెట్‌ కేటాయించాలని కోరుతూ రాకేష్ గతంలో ఎల్లారెడ్డి నుంచి హైదరాబాద్ గాంధీభవన్ వరకు పాదయాత్ర చేశాడని కాంగ్రెస్ నాయకులు తెలిపారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో సెకండ్‌ లిస్ట్‌ సెగలు రేపుతోంది. టికెట్లు రాకపోవడంతో పలువురు నేతలు అసంతృప్తితో రగిలిపోతున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై కీలక నిర్ణయం తీసుకునేందుకు.. కార్యకర్తలు, అభిమానులతో సమావేశాలకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా.. అసంతృప్త నేతలను బుజ్జగించేందుకు రంగంలోకి సీనియర్‌ నేతలు దిగారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..