Telangana Polls: గద్దర్ కుటుంబంలో బయటపడ్డ రాజకీయ విభేదాలు.. టికెట్ కోసం వారసుల మధ్య పోటీ

పొడుస్తున్న పొద్దు మీద ప్రజా ఉద్యమాలను నడిపిన పోరాటాల యోధుడు గద్దర్! గద్దర్‌ ఉద్యమ ప్రస్థానం నుంచి జీవిత చరమాంకం వరకు..ఆయన ప్రజా సమస్యల కోసం పరితపించారు. జనం కోసం గజ్జె కట్టి.. జనహితం కోసం నాట్యమాడిన ప్రజా యుద్ధనౌక. అభ్యుదయ భావాల్ని రగిలించి, విప్లవ జెండాను పైకెత్తి.. జన బాహుళ్యాన్ని ఉత్తేజితం చేసిన ఆ గళం గద్దర్‌ది.

Telangana Polls: గద్దర్ కుటుంబంలో బయటపడ్డ రాజకీయ విభేదాలు.. టికెట్ కోసం వారసుల మధ్య పోటీ
Gaddar With Rahul

Edited By: Balaraju Goud

Updated on: Oct 21, 2023 | 8:16 PM

ప్రజా యుద్ధ నౌక గద్దర్ కుటుంబంలో విభేదాలు రాజకీయంగా బయటపడ్డాయి. కంటోన్మెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ టికెట్ వస్తుందని ఆశించిన గద్దర్ కొడుకు సూర్యంకు సొంత కుటుంబం నుంచే ఎదురు దెబ్బ తగిలింది. ఇంతకీ గద్దర్ కుటుంబం ఏం జరుగుతుంది..?

కాంగ్రెస్ తో గద్దర్ కు అనుబంధం

పొడుస్తున్న పొద్దు మీద ప్రజా ఉద్యమాలను నడిపిన పోరాటాల యోధుడు గద్దర్! గద్దర్‌ ఉద్యమ ప్రస్థానం నుంచి జీవిత చరమాంకం వరకు..ఆయన ప్రజా సమస్యల కోసం పరితపించారు. జనం కోసం గజ్జె కట్టి.. జనహితం కోసం నాట్యమాడిన ప్రజా యుద్ధనౌక. అభ్యుదయ భావాల్ని రగిలించి, విప్లవ జెండాను పైకెత్తి.. జన బాహుళ్యాన్ని ఉత్తేజితం చేసిన ఆ గళం గద్దర్‌ది. ప్రజా యుద్ధం నౌక గద్దర్ కు కాంగ్రెస్ పార్టీకి ఉన్న అనుబంధం అనేక సందర్భాల్లో కాంగ్రెస్ సభల్లో.. సమావేశాల్లో చూపెట్టారు.

సీడబ్ల్యూసీ సమావేశాల కోసం తెలంగాణకు వచ్చిన కాంగ్రెస్ పార్టీ అధినేతలు రాహుల్ గాంధీతో పాటు ప్రియాంక గాంధీ సోనియాగాంధీ గద్దర్ కుటుంబసభ్యులను పరామర్శించారు.. గద్దర్ బతికుంటే ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నారన్న అభిప్రాయం కూడా గతంలో వ్యక్తం అయింది. కానీ గద్దర్ చనిపోయే చివర్లో రాజకీయ పార్టీ పెట్టి దాని ద్వారానే రాజకీయాలకు వస్తానని చెప్పిన నేపథ్యంలో గద్దర్ మరణ వార్త ఒకసారిగా విషాదాన్ని నింపింది. గద్దర్ చనిపోయిన తర్వాత ఆయన స్థాపించిన ప్రజా పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారని అనేక ప్రశ్నలు తలెత్తినప్పటికీ కుటుంబ సభ్యులు మాత్రం గద్దర్ ప్రజా పార్టీని ఎవరు ముందుకు తీసుకెళ్తారో చెప్పలేకపోయారు..!

సరిగ్గా రెండు నెలలకు..

సరిగ్గా గద్దర్ చనిపోయిన తర్వాత కుటుంబ సభ్యుల విభేదాలు బయటకు వచ్చాయి. గద్దర్ కొడుకు సూర్యంకు 2018 లోని పెద్దపల్లి కాంగ్రెస్ టికెట్ ఇవ్వాలని భావించారు. కానీ ఆయన పోటీకి వెనక్కి తగ్గడంతో టికెట్ ఇవ్వలేదు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గద్దర్‌కు కొత్త సంబంధాలు ఏర్పాటులో ఈసారి పోటీ చేస్తారని భావించారు. కానీ గద్దర్ అకాల మరణం తర్వాత గద్దర్ కొడుకు సూర్యంకు రానున్న ఎన్నికల్లో అసెంబ్లీకి పోటీ చేస్తారన్న వార్తలు వచ్చాయి. కానీ అనూహ్యంగా గద్దర్ కూతురు వెన్నెల ప్రెస్ మీట్ పెట్టి.. కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తే కంటోన్మెంట్ ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

దీంతో గద్దర్ ప్రజా పార్టీ వారసులు ఎవరన్న చర్చ నుంచి కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇస్తుందన్న చర్చ ప్రారంభం అయింది. దీంతో కుటుంబ సభ్యుల్లో ఉన్నటువంటి రాజకీయ విభేదాలు ఒకసారి గా బయటకు వచ్చాయి. ఇంతకీ గద్దరు వారుసులు ఇద్దరిలో రాజకీయ వారసులు ఎవరో, కాంగ్రెస్ పార్టీ గద్దర్ కొడుకు సూర్యంకు.. కూతురు వెన్నెలకి టికెట్ ఇస్తారో  వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…