CM KCR: వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. ఆలోచించండి.. సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్..

|

Nov 01, 2023 | 9:58 PM

హ్యాట్రిక్‌ టార్గెట్‌గా భారత రాష్ట్ర సమితి (BRS) ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. పక్కా వ్యూహాలతో గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌ మాటాల తూటాలు పెలుస్తూ.. విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఇల్లందు ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరునూరైనా బీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు.

CM KCR: వాళ్ల మాటలు పట్టించుకోవద్దు.. ఆలోచించండి.. సీఎం కేసీఆర్ షాకింగ్ కామెంట్స్..
CM KCR
Follow us on

హ్యాట్రిక్‌ టార్గెట్‌గా భారత రాష్ట్ర సమితి (BRS) ప్రచారపర్వంలో దూసుకెళ్తోంది. పక్కా వ్యూహాలతో గులాబీ బాస్‌, సీఎం కేసీఆర్‌ మాటాల తూటాలు పెలుస్తూ.. విపక్షాలపై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా సత్తుపల్లి, ఇల్లందు ప్రజాశీర్వాద సభల్లో పాల్గొన్న కేసీఆర్‌ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆరునూరైనా బీఆర్‌ఎస్‌ ప్రభంజనాన్ని ఎవరూ అడ్డుకోలేరన్నారు. ఆగం ఆగం కావొద్దు ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ అభివృద్ది మంత్రంగా మాట్లాడారు. కాంగ్రెస్‌ నేతలకు స్ట్రాంగ్‌ కౌంటర్లు ఇస్తూ కేసీఆర్ వారిపై ఫైర్ అయ్యారు. మరోవైపు సత్తుపల్లి సభలో ఏపీ పరిస్థితులను ప్రస్తావించారు. డబుల్‌ రోడ్డు వస్తే తెలంగాణ.. సింగిల్‌ రోడ్‌ వస్తే ఆంధ్రప్రదేశ్‌ అన్నారు. సరిహద్దుల్లోని ఏపీ ప్రజలు తెలంగాణకు వచ్చి ధాన్యం అమ్ముకుంటున్నారన్నారు. విడిపోతే రాష్ట్రంలో కరెంటు ఉండదని.. నష్టపోతామంటూ శాపాలు పెట్టారని.. ఇప్పుడు ఏపీలోనే చీకట్లు ఉన్నాయన్నారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను అసెంబ్లీ గేటు తాకనివ్వనన్న కాంగ్రెస్‌ నేత పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డికి కేసీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. అహంకారంతో సవాళ్లు చేసేవాళ్లను ఓడించాలన్నారు. 60 ఏళ్ల పాలనలో కాంగ్రెస్‌ ఏం చేసిందో.. పదేళ్ల పాలనలో BRS ఏం చేసిందో ఆలోచించి.. ఓటెయ్యాలంటూ కేసీఆర్ ప్రజలకు సూచించారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లా వాసుల కలలను సాకారం చేస్తూ ఏడాదిలోగా సీతారామ ప్రాజెక్టును పూర్తి చేస్తామని సత్తుపల్లి వేదికగా హామీనిచ్చారు కేసీఆర్‌. ఖమ్మం జిల్లా బంగారు తునక అవుతుందంటూ పేర్కొన్నారు. కొందరు ఏవేవో మాట్లాడుతున్నారని.. వందకు వంద శాతం దళిత బంధును కొనసాగిస్తామని.. చిల్లరగాళ్ల మాటలు పట్టించుకోవద్దంటూ కేసీఆర్ పేర్కొన్నారు. సత్తుపల్లి, ఇల్లందు అభ్యర్థులు సండ్ర వెంకట వీరయ్య, హరిప్రియను భారీ మెజార్టీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

అభివృద్ది-సంక్షేమం బీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్నారు. బీసీ బంధు పై కాంగ్రెసోళ్లు అవాకులు చెవాకులు పేలుతున్నారని విమర్శించారు కేసీఆర్‌. కాంగ్రెసోళ్ల మాటల నమ్మి మోసపోయామని కర్నాటక రైతులు గొల్లుమంటున్నారంటూ పేర్కొన్నారు. కర్నాటకలో కాంగ్రెస్‌ చూడమన్న కాంగ్రెస్‌ నేతల సవాల్‌పై స్పందించిన కేసీఆర్‌.. వారివి అమలుకాని హామీలంటూ ఫైర్ అయ్యారు. ఆదివాసీలకు అన్ని విధాల అండగా వుండేది బీఆర్‌ఎస్‌ ఒక్కటేనన్నారు. హరిప్రియ నాయక్‌ ఆధ్వర్యంలో ఇల్లందు నియోజక వర్గాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు.

ఉమ్మడి ఖమ్మం జిల్లాపై బీఆర్‌ఎస్‌ ఫుల్‌గా ఫోకస్ పెట్టింది. మొన్న పాలేరులో తాజాగా సత్తపల్లి, ఇల్లందులో ప్రజాశీర్వాద సభలు హోరెత్తడంతో కేడర్ లో ఫుల్ జోష్ నెలకొంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..