KA Paul Symbol Issue: ప్రజాశాంతి పార్టీకి కామన్‌ సింబల్‌ కష్టమేనన్న ఈసీ.. న్యాయ పోరాటానికి సిద్ధమైన కేఏ పాల్‌

|

Nov 12, 2023 | 8:13 AM

తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పోటీ చేయగల పార్టీ.. అలాంటి వ్యక్తి ఉన్నారా అంటే.. అది ఒక్కరికే సాధ్యం. అతనే కే.ఏ.పాల్‌. అవును ఆయనకు మాత్రమే ఇలాంటి ఫీట్స్‌ సాధ్యమవుతాయి. అలాంటి పాల్‌కే షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో నా పార్టీనే తీసి పడేస్తారా అంటూ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెడుతున్నారు కేఏ పాల్‌. మరోవైపు అప్పటికే అభ్యర్థులకు ఈసీ సింబల్స్‌ ఇచ్చేసే అవకాశాలున్నాయి. దీంతో కేఏ పాల్‌ పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

KA Paul Symbol Issue: ప్రజాశాంతి పార్టీకి కామన్‌ సింబల్‌ కష్టమేనన్న ఈసీ.. న్యాయ పోరాటానికి సిద్ధమైన కేఏ పాల్‌
Ka Paul
Follow us on

సంచనాలకు కేరాఫ్ గా నిలుస్తారు కేఏ పాల్. ఆయన ఏం మాట్లాడినా సంచలనమే. గల్లీ నుంచి అమెరికా అంశాలపై వరకు తనదైన శైలిలో స్పందిస్తుంటారు కేఏ పాల్. ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కేఏ పాల్ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలపై ఎక్కువ ఫోకస్ చేశారు. ఈ నేపథ్యంలోనే తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడైనా పోటీ చేయగల పార్టీ.. అలాంటి వ్యక్తి ఉన్నారా అంటే.. అది ఒక్కరికే సాధ్యం. అతనే కే.ఏ.పాల్‌. అవును ఆయనకు మాత్రమే ఇలాంటి ఫీట్స్‌ సాధ్యమవుతాయి. అలాంటి పాల్‌కే షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో నా పార్టీనే తీసి పడేస్తారా అంటూ మీడియా ముందుకు వచ్చి గగ్గోలు పెట్టారు పాల్‌.

తెలంగాణలో పాల్‌ అన్న పాలన రాబోతోందన్నారు కేఏ పాల్‌.. ప్రజాశాంతి పార్టీ 79 సీట్లు గెలవబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తనకు 60శాతం ప్రజల మద్దతు ఉందంటున్నారు. ప్రజాశాంతి పార్టీకి జనంలో విపరీతమైన అదరణ లభిస్తుందని.. 15 స్థానాల్లో తమ అభ్యర్థులు పోటీ చేస్తున్నారన్నారు. ఇలాంటి సమయంలో పార్టీ సింబల్ దక్కకపోవడంపై పాల్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

పాల్‌ అన్న రావాలి.. పాలన మారాలి అనేది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడి నినాదం. మాంచి హైఎండ్‌ వాహనాలు పర్చేజ్‌ చేసి.. తెలంగాణ మొత్తం తిరుగుతున్నారు కేఏ పాల్‌. ప్రజాశాంతి పార్టీకి ఓటేయండి అంటూ ముమ్మరంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇప్పటికే 15మంది అభ్యర్థులను బరిలోకి దింపారు పాల్‌. ఈ సమయంలో పాల్‌ పార్టీకి షాకిచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం. ప్రజాశాంతి పార్టీని గుర్తింపులేని రాజకీయ పార్టీగా ప్రకటించింది. దీంతో కేఏ పాల్‌ బాధ వర్ణనాతీతంగా మారింది.

స్వయంగా తనను తాను దైవ దూతగా ప్రకటించుకున్న కేఏ పాల్‌.. ప్రజాశాంతి పార్టీ ద్వారా 2019లో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగారు. అప్పుడు ఆయనకు ఎన్నికల సంఘం హెలికాప్టర్‌ సింబల్‌ను ఇచ్చింది. కానీ పోటీ చేసిన అన్ని నియోజకవర్గాల్లోనూ డిపాజిట్లు గల్లంతయ్యాయి. ఇక, ఇటీవల వచ్చి మునుగోడు ఉప ఎన్నికల సమయంలోనూ పాల్‌ బరిలోకి దిగారు. ఈ సందర్భంగా ఆయనకు ఉంగరం గుర్తు కేటాయించింది ఈసీ. అక్కడా అదే రిజల్ట్‌ వచ్చింది. దీంతో ప్రజాశాంతి పార్టీ యాక్టివ్‌గా లేదని ఎన్నికల సంఘం ప్రకటించింది.

దీంతో అగ్గి మీద గుగ్గిలం అవుతున్నారు పాల్. తనకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉందని, జనంలో ప్రజాశాంతి పార్టీకి అదరణ పెరుగుతుండటం ఓర్వలేకనే సింబల్ కేటాయించలేదంటున్నారు పాల్. అసలు షర్మిల స్థాపించిన వైఎస్‌ఆర్ తెలంగాణ పార్టీకి గుర్తింపు ఉందా..? ఆమె బరిలోనే లేరు. అలాంటి పార్టీకి సింబల్‌ కేటాయించి.. తనకు ఇవ్వకపోవడం దారుణం అంటున్నారు కేఏ పాల్‌. ఈ విషయాన్ని కోర్టులో తేల్చుకుంటామంటున్నారు. నవంబర్ 14న హైకోర్టులో వాదనలు వినిపిస్తానంటున్నారు పాల్‌. మరోవైపు అప్పటికే అభ్యర్థులకు ఈసీ సింబల్స్‌ ఇచ్చేసే అవకాశాలున్నాయి. దీంతో కేఏ పాల్‌ పరిస్థితి ఏంటనేది ఆసక్తికరంగా మారింది.

ఇదిలావుంటే తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. పార్టీల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉంది. ఇలాంటి సమయంలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వేస్తున్న పంచ్‌లు ఫుల్ ఎంటర్ టైన్ చేస్తున్నాయంటే నమ్మాల్సిందే. తన మార్క్‌ డైలాగ్స్‌తో తాజాగా పాల్‌ చేసిన కామెంట్స్‌ కాకరేపుతున్నాయి. తెలంగాణకు తానే ముఖ్యమంత్రి కాబోతున్నారు కేఏ పాల్‌. పెన్షన్‌ను రూ.6వేలు చేస్తామని. అలానే రైతుబంధు రూ.20వేలకు పెంచుతామన్నారు. తెలంగాణలో ప్రజాశాంతి పార్టీ బలమైన శక్తిగా ఆవిర్భవించబోతోందన్నారు. కేజ్రీవాల్‌ని ఢిల్లీలో, పంజాబ్‌లో ఎలా ఎన్నుకున్నారో.. తనని కూడా తెలుగు రాష్ట్రాల్లో అలాగే గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. తెలుగు రాష్ట్రాల ప్రజల జీవితాల్ని తానొక్కడే మార్చగలనని చెప్పుకొచ్చారు. కేఏపాల్‌ మార్క్‌ పాలిటిక్స్‌. ఏదేమైన సరే… ఉత్కపోతకు గురి చేసే రాజకీయ వేడిలో కూడా ఆయన ఏ మాత్రం తగ్గకుండా తన విన్యాసాలు చూపిస్తారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…